Soldier Honey Trap
Soldier Honey-Trap: హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత సైనికుడు పాకిస్తాన్ ఏజెంట్ అయిన యువతికి సైనిక రహస్య సమాచారం చేరవేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు సైనికుడిని అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్ కుమార్ అనే యువకుడు జోధ్‌పూర్‌లో సైనికుడిగా పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే ప్రదీప్ సైన్యంలో చేరాడు.
Death Penalty: సొంత చెల్లెలి పరువు హత్య.. ముగ్గురికి మరణ శిక్ష
ఆరు నెలల క్రితం అతడికి ఫోన్‌లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌కు చెందిన యువతి పరిచయమైంది. ఆమె, తాను బెంగళూరులోని మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లో పని చేస్తున్నట్లు తెలిపింది. తర్వాత వాళ్లిద్దరూ ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా మరింత క్లోజ్ అయ్యారు. తర్వాత ఒకసారి ఢిల్లీలో కలుసుకున్నారు. ప్రదీప్ కుమార్‌ను తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అతడితో చెప్పింది. పెళ్లి చేసుకునేందుకు యువతి అంగీకరించడంతో ఆమెకు మరింత దగ్గరయ్యాడు. ప్రదీప్‌ను పూర్తిగా నమ్మించిన యువతి మెల్లిగా అతడి దగ్గరి నుంచి సైనిక రహస్యాలు తెలుసుకోవడం ప్రారంభించింది.
Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన
ప్రదీప్ సైన్యానికి సంబంధించిన రహస్యాలు, వ్యూహాత్మక సమాచారాన్ని ఆమెకు చెప్పాడు. కొద్ది రోజులుగా అతడిపై నిఘా పెట్టిన ఉన్నతాధికారులు ఇది గుర్తించి, అతడిని అరెస్టు చేశారు.