Death Penalty: సొంత చెల్లెలి పరువు హత్య.. ముగ్గురికి మరణ శిక్ష

సొంత చెల్లెలిని హత్య చేసిన సోదరులకు మరణ శిక్ష విధిస్తూ హరిద్వార్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ నిందితులకు మరణ శిక్ష విధించడమే సరైన చర్య అని కోర్టు అభిప్రాయపడింది.

Death Penalty: సొంత చెల్లెలి పరువు హత్య.. ముగ్గురికి మరణ శిక్ష

Death Penalty

Death Penalty: సొంత చెల్లెలిని హత్య చేసిన సోదరులకు మరణ శిక్ష విధిస్తూ హరిద్వార్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తూ నిందితులకు మరణ శిక్ష విధించడమే సరైన చర్య అని కోర్టు అభిప్రాయపడింది. కేసు వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని షాపూర్‌కు చెందిన ప్రీతి సింగ్ అనే యువతి, పక్కనే ఉన్న ధరంపూర్‌ గ్రామానికి చెందిన బ్రజ్ మోహన్‌ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన

ఈ పెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. పెళ్లి తర్వాత నుంచి ప్రీతి, తన కుటుంబ సభ్యులకు దూరంగానే ఉంటోంది. అప్పట్నుంచి యువతిపై కక్షగట్టిన ఆమె సోదరులు, ప్రీతిని ఎలాగైనా చంపాలనుకున్నారు. ఇందుకోసం ఒక పథకం రచించారు. 2018, మేలో ప్రీతి సోదరులు కుల్‌దీప్ సింగ్, అరుణ్ సింగ్‌లు ప్రేమ పెళ్లి విషయంలో తల్లిదండ్రులను ఒప్పిస్తామని నమ్మించారు. ఇదే క్రమంలో తమ గ్రామంలో ఉన్న బంధువు ఇంటికి రావాలని ప్రీతి సింగ్‌ను కోరారు. తన సోదరులు నిజంగానే మారిపోయి ఉంటారు అని నమ్మిన, ప్రీతి సింగ్ తన బంధువైన సంతర్‌పాల్ ఇంటికి మే 18న వెళ్లింది. తను ఇంటికి రాగానే, కుల్‌దీప్ సింగ్, అరుణ్ సింగ్‌తోపాటు మరో సోదరుడు రాహుల్ కలిసి ప్రీతిపై దాడి చేశారు.

Saroornagar Honour Killing : నా భర్తను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలి : నాగరాజు భార్య ఆశ్రిన్‌

గొడ్డలితో నరికి చంపారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ విషయంపై ప్రీతి భర్త, బ్రజ్ మోహన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితులు ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది.