One Nation One Charger: ‘వన్ నేషన్-వన్ చార్జర్’.. ఇకపై అన్నింటికీ ఒకటే చార్జర్

ఇకపై అన్ని రకాల గ్యాడ్జెట్లకు ఒకే చార్జర్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘వన్ నేషన్-వన్ చార్జర్’ పేరుతో కొత్త విధానం తీసుకురాబోతుంది. దీని ప్రకారం దేశంలో విడుదలయ్యే అన్ని గ్యాడ్జెట్లను ఒకే రకమైన చార్జర్ వాడగలిగేలా తయారు చేయాలి.

One Nation One Charger: స్మార్ట్‌ఫోన్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్, ల్యాప్‌టాప్, పవర్ బ్యాంకు.. ఇప్పుడు ఒకే ఇంట్లో ఇలాంటి బోలెడన్ని గ్యాడ్జెట్స్ కనిపిస్తాయి. ఒక్కో గ్యాడ్జెట్‌కు ఒక్కో రకమైన చార్జర్ వాడాల్సి వస్తుంది. టైప్-ఏ, టైప్-బి, టైప్-సి.. ఇలా అనేక రకాల చార్జర్లు ఉన్నాయి.

Saudi Woman: ట్విట్టర్ వాడినందుకు సౌదీలో మహిళకు 34 ఏళ్ల జైలు శిక్ష

ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు ఒక గ్యాడ్జెట్ చార్జింగ్ అయిపోతే, దానికి సరిపడా చార్జర్ లేకపోతే చాలా కష్టం. వేరే చార్జర్లు ఉన్నా పనికిరావు. అయితే, త్వరలో ఇలాంటి ఇబ్బందులకు ఫుల్‌స్టాప్ పడబోతుంది. దేశంలోని ఇలాంటి అన్ని డివైజెస్, గ్యాడ్జెట్లకు ఒకే చార్జర్ రాబోతుంది. ‘వన్ నేషన్-వన్ చార్జర్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని ప్రకారం అన్ని గ్యాడ్జెట్లకు ఒకే రకమైన చార్జర్ వాడాల్సి ఉంటుంది. అంటే ఒక చార్జర్‌తో ఏ గ్యాడ్జెట్ అయినా చార్జ్ చేయవచ్చు. దీనివల్ల వేరువేరు చార్జర్లకు అడ్డుకట్టపడబోతుంది. దీనికి సంబంధించిన మీటింగ్ బుధవారమే జరిగింది. వివిధ గ్యాడ్జెట్ తయారీ సంస్థలతో కేంద్రం ఈ అంశంపై చర్చలు జరిపింది.

Tamil Nadu: భర్తపై అనుమానంతో.. మర్మాంగాలపై వేడి నీళ్లు పోసిన భార్య

భవిష్యత్తులో రాబోయే గ్యాడ్జెట్లు అన్నింటికీ ఒకే రకమైన చార్జర్ వాడగలిగేలా ఉత్పత్తుల్ని తయారు చేయాలని సూచించింది. ఈ నిర్ణయం అమల్లోకి రావడాకి కాస్త సమయం పట్టినా, ఇది వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. ల్యాప్‌టాప్ చార్జర్‌తో మొబైల్ కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఒకే చార్జర్‌ను కుటుంబ సభ్యులంతా కలిసి వాడుకోవచ్చు. చార్జర్ రాని గ్యాడ్జెట్లకు కొత్త చార్జర్ కొనాల్సిన అవసరం లేదు. అలాగే చార్జర్ పాడైతే మరో చార్జర్ కొనాల్సిన అవసరం లేకుండా, ఇతరుల చార్జర్ కూడా వినియోగించుకోవచ్చు.