BASARA IIIT: అస్తవ్యస్తంగా ట్రిపుల్ ఐటీ పాలన: ఎంపీ సోయం బాపూరావు

తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే విశ్వవిద్యాలయంలో సమస్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణమని బాపూరావు ఆరోపించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి నేటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్స్‌లర్ నియామకం జరగలేదు.

Basara Iiit

BASARA IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. తమకు న్యాయం చేయాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్థానిక ఎంపీ సోయం బాపూరావు గురువారం స్పందించారు.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే విశ్వవిద్యాలయంలో సమస్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణమని బాపూరావు ఆరోపించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి నేటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్స్‌లర్ నియామకం జరగలేదు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు, యూనివర్సిటీ డీన్… ఇలా అందరూ ఇన్‌చార్జులే పాలకవర్గంలో ఉన్నారు. దీంతో ట్రిపుల్ ఐటీలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. మూడేళ్ల నుంచి విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన ల్యాప్‌టాప్స్, యూనిఫామ్స్, ఇతర వస్తువులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. తరచుగా ఆహారంలో పురుగులు వస్తున్నప్పటికీ అధికారులు మెస్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. మంచి నీటి సరఫరా కూడా సక్రమంగా లేదు.

Justice For Sister: చెల్లికి న్యాయం చేయాలంటూ మళ్లీ ఢిల్లీ బాట పట్టిన అన్న

కలుషిత నీటినే అందిస్తున్నారు. పడుకోవడానికి బెడ్లు కూడా లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 250 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఆరేళ్ల నుంచి ఈ అంశం పెండింగులోనే ఉంది. నాలుగేళ్లుగా రాష్ట్ర బడ్జెట్‌లో ట్రిపుల్ ఐటీకి అరకొర నిధులే కేటాయిస్తున్నారు. ఆ నిధులు కూడా ప్రభుత్వం పూర్తిగా ఇవ్వడం లేదు’’ అని సోయం బాపూరావు అన్నారు.