Spicejet
SpiceJet: విమాన ఇంధన ధరలు పెరుగుతూ, రూపాయి విలువ తగ్గుతూ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 10-15 శాతం విమానయాన ఛార్జీలు పెంచాలంటూ స్పైస్‌జెట్ సంస్థ డిమాండ్ చేసింది. సంస్థ సీఎండీ అజయ్ సింగ్ ఈ అంశంపై గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘విమానయాన రంగం డాలరు విలువతో ముడిపడి ఉంది. విమాన ఇంధన ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల దేశీయ విమాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సంస్థలు సేవలు కొనసాగించాలంటే కనీసం 10-15 శాతం విమాన టిక్కెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. 2021 నుంచి విమాన ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్-ఏటీఎఫ్) ధరలు 120 శాతం పెరిగాయి.
Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం
ఇలా ధరలు పెరగడం సరికాదు. ప్రపంచంలోనే అత్యధిక ఏటీఎఫ్ ధర మన దగ్గరే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని, ఏటీఎఫ్ పన్నుల్ని తగ్గించాలి. కొన్ని నెలలుగా ఇంధన ధరల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మా నిర్వహణా వ్యయంలో 50 శాతానికిపైగా ఇంధనానికే ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో విమాన టిక్కెట్ ఛార్జీలు ధరలు పెంచాల్సిన అవసరం ఉంది’’ అని అజయ్ సింగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు అజయ్ సింగ్ చేసిన ఈ ప్రకటన ప్రభావం ఆ సంస్థ షేర్ల విలువపై పడింది. గురువారం ఈ కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 4.89 శాతం, ఎన్ఎస్ఈ నిఫ్టీలో 5 శాతం తగ్గింది.