Heaviest kidney stone : 800 గ్రాముల కిడ్నీ స్టోన్ తొలగించిన శ్రీలంక వైద్యులు .. ప్రపంచ రికార్డులో నమోదైన కేసు

శ్రీలంక వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 62 సంవత్సరాల రిటైర్డ్ సైనికుడికి ఆపరేషన్ చేసి 800 గ్రాముల కిడ్నీ స్టోన్ తొలగించారు. ఇది ఒక అరుదైన రికార్డుగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.

Heaviest kidney stone

Heaviest kidney stone : శస్త్ర చికిత్స ద్వారా కిడ్నీ స్టోన్ తొలగించుకున్న వారి గురించి వింటూ ఉంటాం. కానీ అత్యంత బరువైన కిడ్నీ స్టోన్ తొలగించిన కేసు గురించి వింటే ఆశ్చర్యపోతాం. శ్రీలంక వైద్యులు 62 సంవత్సరాల వ్యక్తికి శస్త్ర చికిత్స చేసి 800 గ్రాముల కిడ్నీ స్టోన్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆ పేషెంట్ కోలుకుంటున్నాడు.

Guinness Record Diamonds Ring : 50 వేల వజ్రాలతో ఉంగరం .. పర్యావరణ సందేశానికి గిన్నిస్‌ రికార్డు

కూంఘే అనే రిటైర్డ్ సైనికుడికి శ్రీలంక వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి అతి పెద్ద కిడ్నీ స్టోన్‌ను తొలగించారు. 13.37 సెం.మీ పొడవు మరియు 10.55 సెం.మీ వెడల్పు ఉన్న ఈ స్టోన్ అతని కిడ్నీ కంటే పెద్దగా ఉందట. ఇక దీని బరువు 800 గ్రాములట. అంటే ఐదు బేస్ బాల్‌ల బరువుకు సమానం అన్నమాట. అతని కిడ్నీలో ఇంత భారీ స్టోన్ ఉన్నప్పటికీ అతని శరీర అవయవాలు మాత్రం నార్మల్ గానే పనిచేస్తున్నాయట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్ అకౌంట్లో కూంఘే కిడ్నీ స్టోన్‌కి సంబధించిన ఫోటోలను షేర్ చేసింది.

Josephine Michaluk : 96 లీటర్లు రక్తాన్ని దానం చేసిన 80 ఏళ్ల బామ్మ .. మానవత్వాన్ని వరించిన గిన్నిస్‌ రికార్డు

గతంలో అతి పెద్ద కిడ్నీ స్టోన్ కలిగి ఉన్న రికార్డ్ ఇండియాకు చెందిన విలాస్ ఘూగే పేరుతో ఉంది. ఘూగే కిడ్నీ స్టోన్ 13 సెం.మీ పొడవు ఉంది. అయితే 2004 లో దానిని తొలగించారు. ఆ తరువాత పాకిస్తాన్‌కు చెందిన వజీర్ ముహమ్మద్ పేరుతో కూడా రికార్డు ఉంది. అప్పట్లో దాని బరువు 620 గ్రాములు. ప్రస్తుతం కూంఘే పేరుతో ఉన్న రికార్డు పాత రికార్డులను చెరిపేసింది.