Guinness Record Diamonds Ring : 50 వేల వజ్రాలతో ఉంగరం .. పర్యావరణ సందేశానికి గిన్నిస్‌ రికార్డు

ఓ పొద్దుతిరుగుడుపై ఓ అందమైన సీతాకోక చిలుక వాలితే ఎలా ఉంటుందో అంత అద్భుత ఆకృతితో 50,000లకుపైగా తయారు చేసిన ఉంగరానికి గిన్నిస్ రికార్డు సాధించింది.

Guinness Record Diamonds Ring :  50 వేల వజ్రాలతో ఉంగరం .. పర్యావరణ సందేశానికి గిన్నిస్‌ రికార్డు

Guinness Record Diamonds Ring

Updated On : April 20, 2023 / 10:45 AM IST

Guinness Record Diamonds Ring : ఒక్క వజ్రంతో ఉంగరం చేయించుకుంటేనే అద్భుతంగా భావిస్తాం.అటువంటి వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా 50,000లకు పైగా వజ్రాలతో ఉంగరం తయారు చేస్తే ఎలా ఉంటుంది..ఎంత అద్భతంగా ఉంటుంది? ధగధగలాడిపోయే దాని సొగసు చూడటానికి రెండు కళ్లు చాలవు కదా..ఓ పొద్దుతిరుగుడు (sun flower)పై ఓ అందమైన సీతాకోక చిలుక (butterfly)వాలితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉందీ ఉంగరం.ఎందుకంటే పొద్దుతిరుగు పువ్వుపై సీతాకోక చిలుక వాలిన మోడల్ లో తయారు చేశారీ ఉంగరాన్ని.

ఈ ఉంగరంలో 50,907వజ్రాలను ఉపయోగించి తయారు చేశారు.వజ్రాలు అంటే భారత్ లో ఠక్కున గుర్తుకొచ్చే ప్రాంతం గుజరాత్ (Gujarat)లోని సూరత్(Surat). అక్కడ వజ్రాల వ్యాపారాలే కాదు వజ్రాలతో అందమైన అద్భుతమైన డిజైన్లతో ఓ రకంగా చెప్పాలంటే యూనిక్ డిజైన్లతో ఆభరణాలను తయారు చేస్తుంటారు స్థానకంగా ఉండే సంస్థలు. అటువంటి సూరత్ లో గతంలో అద్భుతమైన నగలనే కాదు అద్భుతమైన వస్తువులు కూడా వజ్రాలతో తయారు చేసారు స్థానిక కళాకారులు. తాజాగా 50,907వజ్రాలతో ఓ ఉంగరాన్ని తయారు చేశారు. ఆ ఉంగరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ట్ రికార్డు సాధించింది.

సూరత్‌కు చెందిన హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ (Harikrishna Exports) సంస్థ 50,907 వజ్రాలతో ఉంగరాన్ని తయారు చేసింది. మరి ఇన్ని వజ్రాలు ఉపయోగించారు అంటే దాని ధర కూడా అంతే రేంజ్ లో ఉంటుంది కదా..అందుకే దాని ధర రూ.6.44 కోట్లుగా నిర్ణయించారు తాయరీదారులు. వజ్రాలు ఎన్ని ఉన్నా ఉంగరం రూపుదిద్దుకోవాలంటే బంగారం ఉండాల్సిందే కదా..ఈ ఉంగరం తయారీకి 460.55 గ్రాముల రీసైకిల్‌ చేసిన బంగారాన్ని ఉపయోగించారు.

పొద్దుతిరుగు పువ్వుపై సీతాకోక చిలుక వాలిన ఆకృతితో తయారు చేసిన ఈ ఉంగరం తయారు చేయటానికి తొమ్మిది నెలలు పట్టిందని తెలిపారు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ సంస్థ యజమానులు. పైగా ఈ ఉంగరం ఆకృతి పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశంతో తయారు చేశామని తెలిపారు హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ ఎండీ ఘనశ్యాం భాయ్‌ ధోలాకియా.