Student used ChatGPT : హోంవర్క్ కోసం చాట్‌జిపిటిని ఉపయోగించి పట్టుబడ్డ స్టూడెంట్

పెరుగుతున్న టెక్నాలజీ ప్రతీది సులభతరం చేేసేస్తోంది. మనిషి మెదడుకి పని తగ్గించేస్తోంది. ChatGPT , AI వంటివి విద్యార్ధులు కష్టపడకుండా పరీక్షలు రాసేందుకు సాయం చేసేస్తున్నాయి. రీసెంట్‌గా ఓ విద్యార్ధి ChatGPT ఉపయోగించి హోంవర్క్ చేసి పట్టుబడటం పెద్ద చర్చకు దారితీసింది.

Viral News : కృత్రిమ మేధ విద్యారంగంలో పెను సవాల్‌గా మారింది. ChatGPT రాక, AI టూల్ విద్యార్ధుల మేధస్సును దెబ్బ తీస్తున్నాయి. హోంవర్క్ కోసం చాట్‌జిపిటిని ఉపయోగిస్తూ ఓ విద్యార్ధి పట్టుబడిన సంఘటన వైరల్ అవుతోంది.

New AI Model : మన మెదడులో ఆలోచనలను ఈ ఏఐ మోడల్ క్షణాల్లో చదివేస్తుంది.. చాట్‌జీపీటీలా టెక్స్ట్ రూపంలో చెప్పేస్తుంది..!

కొన్ని కీ స్ట్రోక్ లు, కష్టమైన వ్యాసాలు.. పరీక్షల్లో రాయడానికి ఇబ్బంది అయిన ప్రశ్నలకు సమాధానాలు ఇవన్నీ ఇప్పుడు ChatGPT ద్వారా విద్యార్ధులకు సులభతరం అయిపోయింది. వారు మెదడుకి పెద్దగా శ్రమ ఇచ్చే అవసరం ఉండటం లేదు. స్టూడెంట్స్ పరీక్షల్ని ChatGPT పై ఆధారపడి రాస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అర్జున్ అనే ఏడవ తరగతి విద్యార్ధి హోంవర్క్ పూర్తి చేయడానికి AI టూల్‌ని ఉపయోగించి పట్టుబడ్డాడు.

 

వాల్‌నట్ CEO రోషన్ పటేల్ తన కజిన్ అర్జున్ గురించి కథనాన్ని ఫోటోతో పాటు తన అకౌంట్ Roshan Patel నుంచి షేర్ చేయడంతో వైరల్ గా మారింది. “నా చిన్న కజిన్ అర్జున్ తన 7వ తరగతి ఇంగ్లీష్ హోమ్‌వర్క్‌లో ChatGPTని ఉపయోగించి పట్టుబడ్డాడు” అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ను షేర్ చేసుకున్నారు. అర్జున్ హోంవర్క్ చేస్తూ చాట్ బాట్ రిప్లైని కూడా కాపీ చేశాడు. దానిని అసైన్‌మెంట్ నుంచి తొలగించడం మర్చిపోయాడు. దాంతో పాటు హోంర్క్ చూసిన ఉపాధ్యాయుడిని ‘పాయిగ్నెంట్’ పదం ఆలోచనలో పడేసింది. 7వ తరగతి స్టూడెంట్ స్ధాయిని మించిన పదం కావడంతో ఉపాధ్యాయుడికి విషయం అర్ధమైంది.

AI ChatGPT : భవిష్యత్తులో మనుషులతో పనిలేదా? AI చాట్‌బాట్‌లదే ఆధిపత్యమా? అంటే.. ChatGPT ఎంత తెలివిగా సమాధానం చెప్పిందంటే?

ఈ ఘటనకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. యూజర్లు సీరియస్ గా స్పందిస్తున్నారు. కృత్రిమ యాప్‌లు వాడటం ద్వారా విద్యార్ధుల భవిష్యత్ ఏమౌతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు