AI ChatGPT : భవిష్యత్తులో మనుషులతో పనిలేదా? AI చాట్‌బాట్‌లదే ఆధిపత్యమా? అంటే.. ChatGPT ఎంత తెలివిగా సమాధానం చెప్పిందంటే?

AI ChatGPT : రానున్న రోజుల్లో మనుషులతో పనిలేదా? AI చాట్‌బాట్‌లదే రాజ్యమా? మనుషుల ఉద్యోగాలను AI టూల్స్ లాగేసుకుంటాయా? అంటే ChatGPT ఎంత తెలివిగా సమాధానం చెప్పిందో తెలుసా?

AI ChatGPT : భవిష్యత్తులో మనుషులతో పనిలేదా? AI చాట్‌బాట్‌లదే ఆధిపత్యమా? అంటే.. ChatGPT ఎంత తెలివిగా సమాధానం చెప్పిందంటే?

Will AI chatbots replace human jobs in future ( Photo : Google)

AI ChatGPT : రోజురోజుకీ టెక్నాలజీ మరింత అడ్వాన్స్ అవుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే పలు AI టూల్స్ కష్టతరమైన టాస్క్‌లను క్షణాల్లో చక్కబెట్టేస్తున్నాయి. మనుషుల కన్నా స్పీడ్‌గా.. తక్కువ సమయంలో ఎక్కువ టాస్క్‌లను పూర్తి చేసేస్తున్నాయి. కొత్త AI టెక్నాలజీతో రాబోయే రోజుల్లో మనుషులకు పని ఉండదా? మనుషుల అవసరం లేకుండానే AI టెక్నాలజీ పనులన్నీ చక్కబెట్టనున్నాయా? చూస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత రోజుల్లో అనేక AI టూల్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఇటీవలే OpenAI అనే ChatGPT చాట్‌బాట్ ప్రపంచ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీనికి పోటీగా (Bing AI), (Google Bard) వంటి AI చాట్‌బాట్‌లు కూడా వచ్చేస్తున్నాయి.

ChatGPT వంటి AI టూల్స్ ద్వారా మానవాళి ప్రైవసీకి ముప్పు వాటిల్లే పరిస్థితి రావొచ్చుననే ఆందోళన నెలకొంది. అదేగానీ జరిగితే.. భవిష్యత్తులో ChatGPT వంటి టూల్స్ దీర్ఘకాలంలో మనుషుల ఉద్యోగాలను కూడా భర్తీ చేసే పరిస్థితి లేకపోలేదు. ఈ టూల్స్ నిజంగా మనుషుల ఉద్యోగాలను భర్తీ చేయగలవా? ప్రస్తుతం చాలామంది మదిలో ఇదే ప్రశ్న మెదులుతోంది. ఎవరినైనా ఈ ప్రశ్నకు సమాధానం అడిగితే చెప్పడం కూడా కష్టమే..

వాస్తవంగా ఆలోచిస్తే.. AI చాట్‌బాట్‌లు రాబోయే రోజుల్లో అనేక ఉద్యోగాలను ఆటోమేట్ చేయగలవు. కానీ, మనుషులు ఆలోచించేలా మాత్రం కాదని గమనించాలి. అయినప్పటికీ.. దీనికి సమాధానం ఎలా తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇదే విషయంలో AI చాట్‌బాట్‌లు నిజంగా మనుషుల ఉద్యోగాలను భర్తీ చేయగలవా? అని OpenAI ఆధారిత ChatGPTని అడిగితే ఏమని సమాధానం చెప్పిందో తెలిస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే.. అంత తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది ఈ చాట్‌జీపీటీ.. ఇంతకీ ChatGPT చెప్పిన సమాధానం ఏంటి? అనేకదా.. AI చాట్‌బాట్.. భవిష్యత్తులో మనుషుల ఉద్యోగాలను భర్తీ చేయగలదని కచ్చితంగా చెప్పలేదు. అలా జరగదని కూడా చెప్పలేదు.

Read Also : ChatGPT Tech Tips : ఒకే రోజులో రూ. 10వేలు సంపాదించడం ఎలా? అని అడిగితే.. ChatGPT ఎలాంటి టిప్స్ ఇచ్చిందో తెలిస్తే షాకవుతారు!

కొన్ని ఉద్యోగాల్లో ఆటోమేషన్ తప్పదు :
కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ, బేసిక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ వంటి కొన్ని ఉద్యోగాలను ఆటోమేట్ చేయొచ్చు అని తెలిపింది. కొంత ఉద్యోగుల మార్పునకు దారితీయవచ్చు. కానీ, మనుషుల అవసరం లేకుండా పూర్తిగా చాట్‌బాట్ ఉద్యోగాలను చేయలేవని ChatGPT తెలిపింది. AI లాంగ్వేజ్ మోడల్‌గా పేరొందిన చాట్ జీపీటీ.. ఉద్యోగాలను ఆటోమేట్ చేయగలనని రాసుకొచ్చింది. మనుషులు లేకుండా నేరుగా అన్ని పనులను చేసే సామర్థ్యం తనకు లేదని తెలిపింది. అయితే, ChatGPT వంటి AI-ఆధారిత చాట్‌బాట్‌లు కొన్ని ఉద్యోగాలపై పరోక్షంగా ప్రభావం చూపిస్తాయని పేర్కొంది.

Will AI chatbots replace human jobs in future_ This is what ChatGPT said

Will AI chatbots replace human jobs in future ( Photo : Google)

చాట్‌జిపిటితో సహా AI చాట్‌బాట్‌లు, మనుషులు గతంలో నిర్వహించే కొన్ని పనులను ఆటోమాటిక్‌గా చేయగలవని తెలిపింది. కొన్ని పరిశ్రమలలో మాత్రం ఉద్యోగుల మార్పునకు దారితీయవచ్చు. కస్టమర్ సర్వీసులు, డేటా ఎంట్రీ, ప్రాథమిక సమాచారాన్ని తిరిగి పొందడం వంటి సాధారణ వర్క్ చేసే ఉద్యోగాల్లో చాట్‌బాట్‌ల ద్వారా ఆటోమేషన్‌కు ఎక్కువ అవకాశం ఉందని ChatGPT తెలిపింది.

కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేయగలవు :
చాట్‌బాట్ ఉద్యోగ అవకాశాలను కూడా క్రియేట్ చేయగలదని కూడా వివరించింది. AI చాట్‌బాట్‌ల డెవలప్‌మెంట్, AI ప్రోగ్రామింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా విశ్లేషణ వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమని సూచించింది. ఈ రంగాలలో కొత్త ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేయగలదని పేర్కొంది. మనుషుల ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయడం AIకి కష్టమని ChatGPT హైలైట్ చేసింది. ఎందుకంటే.. విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం వంటి మానవ నైపుణ్యాలను AI చేయడం చాలా కష్టమని సమాధానమిచ్చింది.AI చాట్‌బాట్‌లు కొన్ని సాధారణ, తరచూ చేసే పనులను ఆటోమాటిక్‌గా చేయవచ్చు. తద్వారా మనుషులకు మరింత అదనపు పనిభారాన్ని పెంచే అవకాశం ఉంది. పూర్తిగా ఉద్యోగ మార్పు కాకుండా ఉద్యోగ పరివర్తనకు దారితీస్తుంది. అప్పుడు, మనుషులు వ్యూహాత్మక రోల్స్ వైపు మరింత మొగ్గు చూపేలా చేస్తుందని తెలిపింది.

AI టూల్స్‌తో మనుషులకు ఎలాంటి హాని ఉండదు :
మరోవైపు.. ఈ AI చాట్‌బాట్‌లు మనుషులకు సాయం చేయడానికి మాత్రమే తప్పా వారికి ఎలాంటి హాని కలిగించవని Bing AI స్పష్టం చేసింది. చాట్‌జిపిటి వంటి AI చాట్‌బాట్‌ల గురించి మానవులు ఎలాంటి భయాందోళన అవసరం లేదని తెలిపింది. ఎందుకంటే.. మానవులకు సాయం చేయడానికి మాత్రమే డిజైన్ చేయడం జరిగిందని పేర్కొంది. AI చాట్‌బాట్‌లు సెంటిమెంట్ లేదా హానికరమైనవి కావుని తేల్చేసింది. మనుషులు ఉపయోగించుకోవడానికి ప్రోగ్రామ్ చేసిన పనులను మాత్రమే చేయగలవని తెలిపింది.

సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు వాటికి ఉండవని రాసుకొచ్చింది. సొంత ఉద్దేశాలు లేదా భావోద్వేగాలు అసలే ఉండవని, అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడం, సమావేశాలను బుక్ చేయడం, ఇమెయిల్‌లు రాయడం వంటి వివిధ పనులలో మనుషులకు సాయపడే టూల్స్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. AI చాట్‌బాట్‌లు యూజర్లకు కేటగిరీ చేసిన ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించగలవు. కస్టమర్ సంతృప్తిని మెరుగుపరుస్తాయని తెలిపింది. Ai చాట్‌బాట్‌లు భవిష్యత్తులో మనుషుల ఉద్యోగాలను తొలగిస్తాయా? అని అడిగితే దానికి సమాధానం ఇలా చెప్పుకొచ్చింది.

AI కోసం కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి.. మరింత అప్‌గ్రేడ్‌గా ఉండాలి :
రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టాలని సూచించింది. మారుతున్న ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా పోటీపడాలని ChatGPT సూచనలు చేసింది. AI టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోందని, మారుతున్న జాబ్ మార్కెట్‌లో తగినట్టుగా ఉండేందుకు అవసరమైన కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడూ అప్‌గ్రేడ్‌గా ఉండాలని సూచించింది. రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లలో స్కిల్స్ పెంచుకోవడం ద్వారా మారుతున్న ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా మరింత పోటీతత్వాన్ని కలిగి ఉంటారని చెప్పింది.

ప్రస్తుతం, AI చాట్‌బాట్‌లు మనుషుల ఉద్యోగాలను భర్తీ చేయగలవా లేదా అని చెప్పడం చాలా కష్టమే. కొన్ని ఉద్యోగాలు ఆటోమాటిక్‌గా మారతాయి. అయితే, AI డెవలప్‌మెంట్, చాట్‌బాట్ ప్రోగ్రామింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, AI ఎథిక్స్ వంటి రంగాలలో కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాయని తెలిపింది. అందుకే, మారుతున్న జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా AI టెక్నాలజీకి తగినట్టుగా రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్‌పై దృష్టి పెట్టడం చాలా కీలకమని చాట్ జీపీటీ అనేక సమాధానాలను ఇచ్చింది.

Read Also : Viral AI ChatGPT Ban : చాట్‌జీపీటీ బ్యాన్.. దేశాలన్నీ ఈ టూల్‌ను ఎందుకు బ్యాన్ చేస్తున్నాయో తెలుసా? ఫుల్ లిస్టు మీకోసం..!