Kantharao : నటుడు సుమన్‌కు కాంతారావు శత జయంతి పురస్కారం

ఇటీవలే ఒకప్పటి హీరో కాంతారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఘనంగా ఈ వేడుకల్ని జరిపాయి. తాజాగా నటుడు సుమన్ కి కాంతారావు శత జయంతి పురస్కారం బహుకరించనున్నట్టు........

Suman will receive kantharao 100 years award

Kantharao :  ఇటీవలే ఒకప్పటి హీరో కాంతారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఘనంగా ఈ వేడుకల్ని జరిపాయి. తాజాగా నటుడు సుమన్ కి కాంతారావు శత జయంతి పురస్కారం బహుకరించనున్నట్టు, డిసెంబర్ లో రవీంద్ర భారతిలో ఈ వేడుక నిర్వహించనున్నట్టు తెలిపారు ఆకృతి సంస్థ నిర్వాహకులు.

శనివారం నాడు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్ టి రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా వెలుగుతున్న సమయంలోనే వారికి ధీటుగా ప్రముఖ హీరోగా కాంతారావు నిలబడ్డారు. డిసెంబర్ నెలలో రవీంద్రభారతి వేదికగా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నాము. ప్రసిద్ధ హీరో సుమన్ ఈ అవార్డు అందుకుంటారు అని తెలిపారు.

Varisu : తమిళ్, తెలుగు ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టిన ‘వరిసు’

ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, కాంతారావు కత్తి యుద్దాలు తనకు చాలా ఇష్టమని చెబుతూ సుందరీ సుబ్బారావులో ఆయన కు మంచి వేషం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. మరో దర్శకుడు పి.సి. ఆదిత్య మాట్లాడుతూ.. కాంతారావు బయోపిక్ చేస్తున్నట్టు.. ఈ విషయమై వారి స్వగ్రామం కోదాడ మండలం గుదిబండ వెళ్లి వచ్చినట్టు వవరించారు.