Super Star Krishna Passed Away LIVE Update: దివికేగిన ధ్రువతార.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత. శోకసంద్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ.
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
- Harish Thanniru
- Updated on- November 15, 2022 / 10:26 PM IST
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న కృష్ణను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ 1942 మే 31 గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం నాలుగు దశాబ్దాలకుపైగా సాగింది. సినీ కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు.
