Supreme Court Key Judgement : సామూహిక అత్యాచారం, హత్య కేసులో ముగ్గురికి ఉరిశిక్ష రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. ముగ్గురి ఉరిశిక్ష రద్దు చేస్తూ పదేళ్ల తర్వాత తీర్పు వెల్లడించింది.

Supreme Court Key Judgement : అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. ముగ్గురి ఉరిశిక్ష రద్దు చేస్తూ పదేళ్ల తర్వాత తీర్పు వెల్లడించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన యువతి (19) గురుగ్రామ్‌లోని సైబర్‌సిటీ ప్రాంతంలో పని చేసేది. 2012 ఫిబ్రవరిలో ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నిందితులు ఆమెను కారులో కిడ్నాప్‌ చేశారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమె జననాంగంపై దాడి చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. మృతదేహాన్ని హర్యానాలోని రేవారిలో ఓ పొలంలో పడేశారు. మూడు రోజులకు ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. 2014లో ముగ్గురు నిందితులు రవి కుమార్‌, రాహుల్‌, వినోద్‌ ట్రయల్‌ కోర్టు మరణ శిక్ష విధించింది. నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తే ట్రయల్‌ కోర్టు తీర్పును కోర్టు సమర్థించింది.

Bilkis Bano Rape case : బిల్కిస్ బానో అత్యాచార నిందితుల విడుదల .. కేంద్రం,గుజ‌రాత్ ప్ర‌భుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో విచారణ చేపట్టిన కోర్టు.. నిందితుల మరణ శిక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పు చెప్పే సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా.. కోర్టులో ఉద్వేగాలకు తావు ఉండదని.. వాస్తవాలు, సాక్ష్యాలు, ఆధారాలే ముఖ్యమని సీజేఐ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు