Bilkis Bano Rape case : బిల్కిస్ బానో అత్యాచార నిందితుల విడుదల .. కేంద్రం,గుజ‌రాత్ ప్ర‌భుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

బిల్కిస్ బానో సామూహిక అత్యాచార నేరస్తులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక సదుపాయాల్ని కల్పించి గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో బిల్కిస్ బానో అత్యాచార కేసులో నిందితుల్ని విడుదల చేసిన అంశంపై సుప్రీంకోర్టు కేంద్రం ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

Bilkis Bano Rape case : బిల్కిస్ బానో అత్యాచార నిందితుల విడుదల .. కేంద్రం,గుజ‌రాత్ ప్ర‌భుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

Bilkis Bano Rape case

Bilkis Bano Rape case : బిల్కిస్ బానో సామూహిక అత్యాచార నేరస్తులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక సదుపాయాల్ని కల్పించి గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో బిల్కిస్ బానో అత్యాచార కేసులో నిందితుల్ని విడుదల చేసిన అంశంపై సుప్రీంకోర్టు కేంద్రం ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

Also read : Bilkis Bano case remission: బిల్కిస్‌ బానోపై గ్యాంగ్ రేప్ చేసినవారు బ్రాహ్మణులు.. వారికి మంచి సంస్కారం ఉంది: బీజేపీ ఎమ్మెల్యే
బిల్కిస్ బానో అత్యాచార కేసు గురించి గురువారం (ఆగస్టు 25,2022) విచార‌ణ జ‌రిగింది. 11 మంది నిందితుల రిలీజ్ గురించి వివ‌ర‌ణ ఇవ్వాలంటూ గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 15 రోజున బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజ‌రాత్ ప్ర‌భుత్వం విడుదల చేసింది. కాలం చెల్లిన రెమిష‌న్ విధానం ప్ర‌కారం వారిని రిలీజ్ చేసింది. దీనిపై దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతోంది.

గుజ‌రాత్ ప్ర‌భుత్వ తీరును విప‌క్షాలతో పాలు పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అత్యాచార నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడకపోగా పైగా వారిని విడుదల చేయటమా? అని నిల‌దీస్తున్నారు. ఈ క్రమంలో దాఖ‌లైన పిటిష‌న్ల‌ను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితుల విడుద‌ల గురించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. 2002లో గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు పలువురు. ఆ కేసులో 11 మంది నిందితులుగా ఉన్నారు. బాధితురాలు తనకు జరిగిన ఘోరంపై పోరాటం చేసినా ఫలితం దక్కకుండాపోయింది. పైగా అత్యాచార నిందితులను విడుదల చేయటం అత్యంత హేయం అని మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

Also read : Bilkis Bano case: బిల్కిస్ బానో నిందితుల విడుదల తప్పిదం: సొంత పార్టీపై బీజేపీ సీనియర్ నేత విమర్శలు

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అత్యాచార నిందితులను విడుదల చేయడం విచారకరమని..విమర్శిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకవైపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మహిళలకు అండగా ఉంటామని, పురుషులతో సమానంగా స్త్రీలకు గౌరవం లభించాలని ప్రసంగించారని..కానీ మరోపక్క మాత్రం అత్యాచార నిందుతులను 20 ఏళ్లుగా శిక్ష పడకపోగా..వారిని విడుదల చేయటం అత్యంత సిగ్గుచేటని..ఇది భారత దేశ స్వాంత్ర్య వేడుకలకు ఇదేనా అర్థం అంటూ ప్రశ్నిస్తున్నారు.