Bilkis Bano case remission: బిల్కిస్‌ బానోపై గ్యాంగ్ రేప్ చేసినవారు బ్రాహ్మణులు.. వారికి మంచి సంస్కారం ఉంది: బీజేపీ ఎమ్మెల్యే

బిల్కిస్‌ బానోపై గ్యాంగ్ రేప్, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో గోద్రా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ఆగస్టు 15న 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడంపై వస్తోన్న విమర్శలపై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే సీకే రౌల్జీ స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''వారు నేరానికి పాల్పడ్డారో లేదో నాకు తెలియదు. వారు బ్రాహ్మణులు.. బ్రాహ్మణులకు మంచి సంస్కారం ఉంటుంది. వారిని కొందరు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కుట్రకు పాల్పడి ఉండవచ్చు. జైల్లో వారి ప్రవర్తన బాగుంది'' అని చెప్పుకొచ్చారు. అందుకే వారిని విడుదల చేశారని అన్నారు.

Bilkis Bano case remission: బిల్కిస్‌ బానోపై గ్యాంగ్ రేప్ చేసినవారు బ్రాహ్మణులు.. వారికి మంచి సంస్కారం ఉంది: బీజేపీ ఎమ్మెల్యే

Bilkis Bano case remission

Bilkis Bano case remission: బిల్కిస్‌ బానోపై గ్యాంగ్ రేప్, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో గోద్రా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ఆగస్టు 15న 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడంపై వస్తోన్న విమర్శలపై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే సీకే రౌల్జీ స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ”వారు నేరానికి పాల్పడ్డారో లేదో నాకు తెలియదు. వారు బ్రాహ్మణులు.. బ్రాహ్మణులకు మంచి సంస్కారం ఉంటుంది. వారిని కొందరు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కుట్రకు పాల్పడి ఉండవచ్చు. జైల్లో వారి ప్రవర్తన బాగుంది” అని చెప్పుకొచ్చారు. అందుకే వారిని విడుదల చేశారని అన్నారు.

కాగా, గోద్రా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆ 11 మందిని విడుదల చేయడంపై దేశంలోని పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, ఖైదీలకు శిక్ష తగ్గించడంపై జూన్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాసింది. యావజ్జీవ కారాగార శిక్ష పడినవారితో పాటు అత్యాచారానికి పాల్పడినవారి నేరాలను క్షమించవద్దని చెప్పింది. ఈ లేఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అంది రెండు నెలలయినా కావట్లేదు.గుజరాత్ ప్రభుత్వం 11 మందిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అది చాలదన్నట్లు, వారిపై కొందరు నేతలు ప్రశంసలు కురిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

China New Mission: చైనా మరో ఎత్తుగడ.. హిందూ మహాసముద్రంలో పట్టు కోసం కుయుక్తులు..