Nagpur man : అతను సమోసాలు ఎందుకు అమ్ముతున్నాడో తెలిస్తే కచ్చితంగా సపోర్ట్ చేస్తారు..

ఐఏఎస్ కావాలన్నది అతని కల.. కానీ ఆర్దిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. తన కల నిజం చేసుకోవడానికి ఓ దివ్యాంగుడు పడుతున్న కష్టం అందరిలో స్ఫూర్తి నింపుతుంది.

The story of a Nagpur man :  నాగపూర్ కి (Nagpur ) చెందిన ఓ దివ్యాంగుడు (Specially-abled ) తన మూడు చక్రాల బైక్ మీద సమోసాలు అమ్ముతున్నాడు. అతను అలా చేయడం వెనుక కథ వింటే మీరు ఖచ్చితంగా స్ఫూర్తి పొందుతారు.

Korean Blogger : ఛీ..ఛీ.. దుస్తులు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపించి.. విదేశీ యువతిని వేధించిన యువకుడు, వీడియో వైరల్

సోషల్ మీడియాలో రకరకాల కథలు, కథనాలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగించేవి.. కొన్ని ఇన్ స్పైర్ చేసేవి ఉంటాయి. నాగపూర్ కి చెందిన సూరజ్ (Suraj) అనే దివ్యాంగుడు సమోసాలు విక్రయించడం వెనుక కథ తెలిస్తే మనసు కదిలిస్తుంది.

సూరజ్ నాగపూర్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కంప్లీట్ చేశాడు. అయితే అతనికి ఇంకా ఏ ఉద్యోగం దొరకలేదు. ఇక తన బైక్ మీద సమోసాలు అమ్మడం మొదలుపెట్టాడు. అలా అమ్మగా వచ్చే డబ్బుల్తో అతను ఐఏఎస్ (IAS) కావాలని అనుకుంటున్నాడు. ఐఏఎస్ అవ్వడం కోసం సూరజ్ పడుతున్న కష్టాన్ని ఫుడ్ వ్లాగర్ గౌరవ్ వాసన్ (Gaurav Wasan) తన వీడియో ద్వారా వివరిస్తూ షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

dancing cop : హీరోల్ని మించి స్టెప్పులు ఇరగదీస్తున్న ముంబయి పోలీస్ వీడియో వైరల్

సూరజ్ ను చూసి చాలామంది ఇన్ స్పైర్ అవుతున్నారు. దేవుడు మీకు మంచి జీవితాన్ని ఇస్తాడని కొందరు.. మీరు తప్పక విజయం సాధిస్తారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కష్టపడితే సాధించలేనిది లేదు. సూరజ్ కి నిజంగా తగిన సపోర్ట్ లభించి తన కల నెరవేరాలని అందరం కోరుకుందాం.

ట్రెండింగ్ వార్తలు