China-Taiwan conflict
China-Taiwan conflict: చైనా దుందుడుకు చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని తైవాన్ సంకేతాలు ఇచ్చింది. తాజాగా, చైనా తీరప్రాంతానికి వెలుపల తైవాన్ ఔట్ పోస్టులపై సంచరిస్తున్న డ్రోనును కుప్పకూల్చింది. చైనా డ్రోనును తైవాన్ పేల్చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఈ పరిణామంతో తైవాన్-చైనా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తైవాన్ కాల్పులు జరిపిన అనంతరం మరికొన్ని చైనా డ్రోన్లు తోకముడుచుకుని కిన్‌మెన్ ద్వీప సమూహాల గగనతలం నుంచి జియామెన్‌కు తిరిగి వెళ్ళినట్లు తైవాన్ తెలిపింది.
తాము చైనా డ్రోనును కుప్పకూల్చడాన్ని తైవాన్ సమర్థించుకుంది. తాము రెచ్చగొట్టే చర్యలకు పాల్పడబోమని చైనా పాల్పడుతోన్న దుందుడుకు చర్యలకు మాత్రం చెక్ చెప్పాలనుకుంటున్నామని చెప్పింది. ఇప్పటికే చైనాకు పలుసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ ఆ దేశం వినిపించుకోలేదని తెలిపింది. అందుకే తాము చైనా డ్రోనును కుప్పకూల్చి సరైన చర్య తీసుకున్నామని పేర్కొంది. చైనా ఇప్పటికైనా సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెంచేలా దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది.