India exercising with Russia: అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ రష్యా చేపట్టిన విన్యాసాల్లో పాల్గొన్న భారత్

రష్యా నిన్నటి నుంచి వొస్టాక్‌ 2022 పేరుతో ప్రారంభించిన సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొంది. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోన్న వేళ రష్యా చేపట్టిన విన్యాసాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ భారత్ వెనక్కి తగ్గలేదు. రష్యాలో చేపట్టిన విన్యాసాల్లో భారత్‌, చైనా, బెలారస్‌, తజకిస్థాన్‌, మంగోలియా వంటి దేశాలూ పాల్గొంటాయని రష్యా ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆయా దేశాలకు సంబంధించిన 50 వేల మంది జవాన్లు, 140 యుద్ధ విమానాలు, 60 యుద్ధ నౌకలు పాల్గొంటాయని చెప్పింది. భారత సైనికుల పెరేడ్, పాటలు పాడడం వంటి దృశ్యాలు అందులో కనపడ్డాయి. 7/8 గూర్ఖా రైఫిల్స్ తో భారత సైన్యం ఈ విన్యాసాల్లో పాల్గొంది.

India exercising with Russia: అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ రష్యా చేపట్టిన విన్యాసాల్లో పాల్గొన్న భారత్

India exercising with Russia

India exercising with Russia: రష్యా నిన్నటి నుంచి వొస్టాక్‌ 2022 పేరుతో ప్రారంభించిన సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొంది. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోన్న వేళ రష్యా చేపట్టిన విన్యాసాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ భారత్ వెనక్కి తగ్గలేదు. రష్యాలో చేపట్టిన విన్యాసాల్లో భారత్‌, చైనా, బెలారస్‌, తజకిస్థాన్‌, మంగోలియా వంటి దేశాలూ పాల్గొంటాయని రష్యా ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆయా దేశాలకు సంబంధించిన 50 వేల మంది జవాన్లు, 140 యుద్ధ విమానాలు, 60 యుద్ధ నౌకలు పాల్గొంటాయని చెప్పింది.

గత ఏడాది కూడా రష్యా ఈ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఇందులో దాదాపు 17 దేశాలు పాల్గొన్నాయి. నిన్నటి నుంచి ప్రారంభమైన వొస్టాక్‌ 2022లో భారత సైన్యం పాల్గొనే విన్యాసాలకు సంబంధించిన ఫొటోలను రష్యా విడుదల చేసింది. భారత సైనికుల పెరేడ్, పాటలు పాడడం వంటి దృశ్యాలు అందులో కనపడ్డాయి. 7/8 గూర్ఖా రైఫిల్స్ తో భారత సైన్యం ఈ విన్యాసాల్లో పాల్గొంది.

తమ మిత్రదేశాల మధ్య రక్షణపర భాగస్వామ్యాన్ని పెంచడం కోసమే ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు రష్యా చెప్పింది. వొస్తోక్‌-2022 పేరిట చేపట్టిన ఈ విన్యాసాలు సెప్టెంబరు 7వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఏడు రోజులూ విన్యాసాల్లో భారత్ పాల్గొననుంది.

The story behind Lingayat seer: ఇద్దరు అమ్మాయిలపై మఠాధిపతి లైంగిక వేధింపులు.. అరెస్టు.. అసలు ఏం జరిగిందంటే..?