The story behind Lingayat seer: ఇద్దరు అమ్మాయిలపై మఠాధిపతి లైంగిక వేధింపులు.. అరెస్టు.. అసలు ఏం జరిగిందంటే..?

శ్రీ మురుగ మఠాధిపతిగా బసవరాజన్ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా సౌభాగ్యత అనే మహిళతో ఆయన ప్రేమలోపడ్డారు. దీంతో మఠాధిపతి బాధ్యతలను స్వీకరించలేకపోయారు. శ్రీ మురుగ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం శివమూర్తి శరణుకు వచ్చింది. సౌభాగ్యను బసవరాజ్ పెళ్ళి చేసుకున్న తర్వాత మఠ నిర్వాహకుడిగా నియమితుడయ్యారు. ఇటీవల శివమూర్తి మురుగపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇద్దరు మైనర్ల ఫిర్యాదుతో మైసూరు సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఇద్దరు బాలికలకు 15, 16 ఏళ్ళు ఉంటాయి. ఎస్కే బసవరాజన్, ఆయన భార్య కలిసి తనపై కుట్ర పన్ని కేసు పెట్టించారని శివమూర్తి ఆరోపించారు.

The story behind Lingayat seer: ఇద్దరు అమ్మాయిలపై మఠాధిపతి లైంగిక వేధింపులు.. అరెస్టు.. అసలు ఏం జరిగిందంటే..?

The story behind Lingayat seer

The story behind Lingayat seer: ఇద్దరు మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటకలోని శ్రీ మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును పోలీసులు నిన్న అరెస్టు చేశారు. అనంతరం జిల్లా సెషన్స్​ జడ్జి ముందు ప్రవేశపెట్టి హాజరుపర్చారు. శివమూర్తి మురుగ శరణరుకు జడ్డి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నిందితుడికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆగస్టు 26న శివమూర్తి మురుగ శరణరుపై పోలీసులు పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు.

అయితే, ఆ సమయంలో ఆయన పలు ఆరోపణలు చేశారు. కర్ణాటక మురుగమఠ్ నిర్వాహకుడు ఎస్కే బసవరాజన్, ఆయన భార్య కలిసి తనపై కుట్ర పన్ని కేసు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఎస్కే బసవరాజన్ తో పాటు ఆయన భార్య సౌభాగ్యపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతేకాదు, అదే సమయంలో బసవరాజన్ పై మురుగమఠం వార్డెన్ రష్మీ అత్యాచారం, అపహరణ కేసులు పెట్టడం గమనార్హం. అసలు బసవరాజన్ ఎస్కేకు, శివమూర్తి శరణుకు ఎలా పరిచయం ఏర్పడిందంటే… వారిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.

వారు లింగాయత్ లోని జన్గమారు కమ్యూనిటికీ చెందినవారు. ఒకే సమయంలో మఠంలో చేరారు. శ్రీ మురుగ మఠాధిపతిగా బసవరాజన్ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా సౌభాగ్యతతో ఆయన ప్రేమలోపడ్డారు. దీంతో మఠాధిపతి బాధ్యతలను స్వీకరించలేకపోయారు. శ్రీ మురుగ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం శివమూర్తి శరణుకు వచ్చింది. సౌభాగ్యను బసవరాజ్ పెళ్ళి చేసుకున్న తర్వాత మఠ నిర్వాహకుడిగా నియమితుడయ్యారు.

ఓ కమిటీని ఏర్పాటు చేసి మఠానికి సంబంధించిన లావాదేవీలు తన సంతకం చేస్తేనే జరిగేలా చేసుకున్నారు. అనంతరం బసవరాజ్ మఠానికి చెందిన డబ్బును దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అంతేగాక, ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మఠానికి చెందిన ఆస్తులను అమ్మేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను 2007లో మఠ నిర్వాహకుడి బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం ఆయన 2008లో జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఏడాది తిరిగి ఆయన మఠ నిర్వాహకుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, గతంలోలా ఆయనకు పూర్తి అధికారాలు దక్కలేదు. శివమూర్తి శరణు, బసవరాజన్ మళ్ళీ కలిసి పని చేశారు. ఇందుకు వారి మధ్య ఏ ఒప్పందం కుదిరిందన్నది ఓ రహస్యంగానే ఉండిపోయింది. అయితే, జూలైలో బసవరాజన్, ఆయన భార్య మళ్ళీ మఠానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ దానికి దూరంగా ఉండిపోయారు. ఇటీవల శివమూర్తి మురుగపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

ఇద్దరు మైనర్ల ఫిర్యాదుతో మైసూరు సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఇద్దరు బాలికలకు 15, 16 ఏళ్ళు ఉంటాయి. మఠం నిర్వహిస్తోన్న పాఠశాలలోనే వారు చదువుకుంటున్నారు. మఠం నుంచి వెళ్ళిపోయి చివరకు మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మురుగ మఠాధిపతిని పోలీసులు అరెస్టు​ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడున్నరేళ్ళ నుంచి వారిపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు కుట్ర పూరితంగా చేశారని శివమూర్తి అంటున్నారు.

Katrina Kaif : అందుకే మా పెళ్లిని సీక్రెట్ గా చేసుకున్నాం.. తన పెళ్లి గురించి మొదటిసారి మాట్లాడిన కత్రినా కైఫ్..