KGF2: కేజీఎఫ్2కు తోడుగా సలార్.. సర్‌ప్రైజ్ ఇస్తారా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే....

Talk Of Salaar Teaser In Kgf 2 Theatres

KGF2: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాస్ ప్రభంజనం ఖాయమని అంటున్నారు సినీ ప్రేమికులు. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి మాస్ ఫీస్ట్‌గా తెరకెక్కించగా, ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KGF2: తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్!

ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో ఓ సర్‌ప్రైజ్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ 2 చిత్రాన్ని రిలీజ్ చేసే థియేటర్లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ నుండి ఓ టీజర్‌ను వదలాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఈ రెండు సినిమాలకు కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడంతోనే ఇలాంటి ఆలోచన చేస్తున్నారట చిత్ర యూనిట్.

అయితే ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రం నుండి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, వర్కింగ్ స్టిల్స్ మాత్రమే ఇప్పటివరకు బయటకు వచ్చాయి. మరి ఇలాంటి సమయంలో సలార్ టీజర్‌ను నిజంగానే కేజీఎఫ్2 సినిమాతో పాటు ప్రదర్శిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ ఔట్ అండ్ ఔట్ పూర్తి మాస్ అవతరాంలో కనిపించనున్న ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంతమేర షూటింగ్ జరుపుకోగా, త్వరలోనే మరో షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

KGF2: ఇట్స్ ఎమోషనల్ టైమ్.. కేజీఎఫ్ కష్టాలను చెప్పుకుంటున్న యష్-దత్!

మరి కేజీఎఫ్2కు తోడుగా ప్రభాస్ సలార్ టీజర్‌తో రంగంలోకి దిగుతాడా లేడా అనేది ఏప్రిల్ 14న తేలిపోనుంది. ఇక కేజీఎఫ్ 2 చిత్రంతో యశ్ హీరోగా నటిస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజీనెస్ జరుపుకోవడంతో, ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.