Tamannaah November Story: మరో వెబ్ సిరీస్‌తో రాబోతున్న మిల్కీబ్యూటీ!

బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదానికి తమన్నా చక్కగా సరిపోతుందేమో. తమన్నా ఇండస్ట్రీకొచ్చి 16 ఏళ్ళు. నిన్నకాక మొన్నొచ్చిన హీరోయిన్స్ ఏదో నాలుగు సినిమాలు చేసి ఫేడ్ అవుట్ అయిపోతుంటే తమన్నా మాత్రం ఇప్పటికీ ఇంకా స్టార్ హీరోలకు జోడీ కడుతుంది.

Tamannaah November Story: మరో వెబ్ సిరీస్‌తో రాబోతున్న మిల్కీబ్యూటీ!

Tamannaah November Story

Updated On : May 15, 2021 / 5:03 PM IST

Tamannaah November Story: బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదానికి తమన్నా చక్కగా సరిపోతుందేమో. తమన్నా ఇండస్ట్రీకొచ్చి 16 ఏళ్ళు. నిన్నకాక మొన్నొచ్చిన హీరోయిన్స్ ఏదో నాలుగు సినిమాలు చేసి ఫేడ్ అవుట్ అయిపోతుంటే తమన్నా మాత్రం ఇప్పటికీ ఇంకా స్టార్ హీరోలకు జోడీ కడుతుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వరసపెట్టి కుర్రహీరోలతో కూడా రొమాన్స్ చేస్తుంది. ఒకవైపు నాలుగైదు, సినిమాల చేతిలో ఉండగానే ప్రస్తుత పరిస్థితిలో ఫుల్ డిమాండ్ ఉంటున్న వెబ్ సిరీస్ ల మీద కూడా ఫోకస్ చేస్తుంది.

తమన్నా ఇప్పటికే లెవన్త్‌ అవర్‌ అనే వెబ్ సిరీస్ లో నటించగా ఇటీవలే ఇది ఆహాలో ప్రసారం అయ్యి పరవాలేదనిపించింది. ఈ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించగా ఇందులో తమన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా, ఇప్పుడు తమన్నా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వంలో తమన్నా నవంబర్ స్టోరీలో నటించగా ఈ సిరీస్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ నెల 20 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో ఈ నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ విడుదల చేసేందుకు సిద్ధమవుతుండగా తెలుగు, తమిళ భాషాలతో పాటు హిందీలో కూడా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో తమన్నా అనురాధ అనే అమ్మాయి పాత్రలో నటించగా ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని ఖచ్చితంగా ఇది తనకు ప్లస్ అవుతుందని చెప్తుంది. మరోవైపు తమన్నా నటించిన ‘సీటీమార్’, హిందీలో ‘బోలె చుడియన్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. వెంకీ జోడిగా ‘ఎఫ్-3’, నితిన్ ‘మాస్ట్రో’తో పాటు ‘గుర్తుందా శీతాకాలం’ అనే మూడు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి.