Tamil Nadu CM : దేవాలయంలోని బంగారంపై దృష్టిపెట్టిన స్టాలిన్.. బిస్కెట్లుగా మార్చాలని ఆదేశం

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఊహించని నిర్ణయాలతో వార్తల్లో ఉంటున్నారు స్టాలిన్.. తాజాగా తనకోసం ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశించి ప్రజల మనసు దోచుకున్నారు.

Tamil Nadu CM : తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఊహించని నిర్ణయాలతో వార్తల్లో ఉంటున్నారు స్టాలిన్.. తాజాగా తనకోసం ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశించి ప్రజల మనసు దోచుకున్నారు. ఇక తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న, భక్తులు కానుకల ద్వారా సమర్పించిన బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా మార్చేందుకు స్టాలిన్ ప్రభుత్వం సిద్ధమైంది. బంగారు ఆభరణాలను 24 క్యారెట్ల బిస్కెట్లుగా మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం.

చదవండి : MK Stalin: పోలీసులకు సీఎం వరాలు.. 700మంది ఖైదీల విడుదల

ఇక వీటిని బ్యాంకులో తనకా పెట్టి ఈ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి తద్వారా కొత్తగా పెట్టుబడిని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఆలయాల పరిరక్షణ, విగ్రహాలు, ఆభరణాల భద్రత, అన్యాక్రాంతమైన ఆస్తుల స్వాధీనం దిశగా డీఎంకే ప్రభుత్వం చర్యలను వేగవంతం అడుగులు చేస్తుంది.. ఈ నేపథ్యంలోనే ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బిస్కెట్లుగా మార్చనుంది. గత పాలకులు 479 కేజీల బంగారాన్ని బిస్కెట్లుగా మార్చారు.

చదవండి : Tamil Nadu : పొగడ్తలు వద్దు..తప్పు ఉంటే ఎత్తి చూపండి, మీడియాకు సూచన

రాష్ట్రంలో దేవాదాయ శాఖపరిధిలో 35 వేల దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో 2137 కిలోల బంగారం నిరుపయోగంగా ఉంది. దీంతో దానిని బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో పెట్టి ప్రభుత్వం అప్పు తీసుకోనుంది. ఇక ఇందులో అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిఘా మధ్య బంగారు ఆభరణాలను బిస్కెట్లుగా మార్చనున్నారు.

ట్రెండింగ్ వార్తలు