Tamil Nadu : పొగడ్తలు వద్దు..తప్పు ఉంటే ఎత్తి చూపండి, మీడియాకు సూచన

ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే విధంగా వార్తలు, కథనాలు ప్రచురించాలని తాను ఎన్నడూ ఆదేశించలేదన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్.

Tamil Nadu : పొగడ్తలు వద్దు..తప్పు ఉంటే ఎత్తి చూపండి, మీడియాకు సూచన

Stalin

Tamil Nadu CM Stalin : తమ ప్రభుత్వం చేసే పనులు, పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపండి.విమర్శలు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాం..అంతేగా…ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే విధంగా వార్తలు, కథనాలు ప్రచురించాలని తాను ఎన్నడూ ఆదేశించలేదన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్. లోట్లు పాట్లు..ఇతర తప్పులు ఉంటే చూపించాలని..వాటిని సరిదిద్దుకొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నేతృత్వంలో చెన్నైలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంకే స్టాలిన్ హాజరయ్యారు.

Read More : Husband Suicide : భార్య వేధింపులతో డీఎంకే నేత ఆత్మహత్య

ఈ సందర్భంగా..ఆయన మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లో ఎన్నో పథకాలు తీసుకరావడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల వసతులు, అవకాశాలు మెండుగా ఉన్నాయని, పారిశ్రామిక పెట్టబడులకు నెలవు అన్నారు. పారిశ్రామిక రంగానికి తమ ప్రభుత్వం పునర్ జ్జీవం పోసిందన్నారు. ఆ వర్గం..ఈ వర్గం అనేది తేడా లేకుండా..అన్ని సామాజిక వర్గాల సంక్షేమం కోసం..అభివృద్ధి కోసం డీఎంకే మోడల్ అన్నారు.

Read More : Electricity Problems: ముంచుకొస్తున్న చీకట్లు..!

పారిశ్రామిక ఎగుమతుల్లో తమిళనాడు రాష్ట్రం మూడోస్థానంలో నిలిచిందనే విషయం ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, రూ. 2 లక్షల కోట్ల పబ్లిక్ రంగ సంస్థలు సైతం అప్పుల్లో ఉన్నాయన్నారు. ఈ అప్పులు తీర్చేందుకు…నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం స్టాలిన్.