Telangana: మూసీ మురికికాలువ కాదు..కృష్ణా-మూసీ నదుల సంగమంలో వజ్రాల గనులు : సర్వేలో వెల్లడి

మూసినది అంటే మురికి కాలువ కాదు..వజ్రాల గని అని చెబుతోంది ఓ సర్వే. కృష్ణానది-మూసీ నది సంగం ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయని తాజా సర్వే వెల్లడించింది.

Comfluence Of Musi Krishna May Thow Up Diamonds

Musi-Krishna Rivers Confluence Wadapalli diamonds : మూసీ అంటే చాలు ముక్కు మూసుకుంటాం. కానీ ఇప్పుడు మూసినది అంటే మురికి కాలువ కాదు..వజ్రాల గని అని చెబుతోంది ఓ సర్వే. కృష్ణానది-మూసీ నది సంగమం ప్రాంతంలో వజ్రాలు లభ్యమవుతాయని తాజాగా చేపట్టిన పరిశోధన అధ్యయనం వెల్లడించింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని కృష్ణా నదిలో మూసీ నది కలిసే సంగమ ప్రదేశంలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని..ఓయూ యూనివర్సిటీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతర సంస్థల పరిశోధకులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అధ్యయనాలు చేపట్టగా ఆ ప్రాంతంలో వజ్రాలు లభ్యమయ్యే అవకాశాలున్నాయని తేలింది. కాగా మూసీ అంటేకాలువే అన్నట్లుగా మారిపోయింది మూసీ పరివాహక ప్రాంతాలు కజ్జాలకు గురి కావటంతో. పైగా పారిశ్రామిక వ్యర్ధాలు మూసీలో కలిసిపోవటంతో ఒకప్పుడు స్వచ్చమైన నీరు ప్రవహించే మూసీ మురికి కాలువగా మారిపోయింది. తీవ్ర దుర్భంధ నదిగా మారిపోయింది. హైదరాబాద్ నగరం మధ్య నుంచి పారే మూసి పేరు చెబితే ముక్కు మూసుకునేలా మారిపోయింది.

Read more : Pushpa Thank You Meet : కంటతడి పెట్టించిన సుకుమార్.. లైట్ అండ్ సెట్ బాయ్స్‌కి లక్ష రూపాయలు ప్రకటన..

అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది కృష్ణా నది ఉపనది మూసీ నది. హైదరాబాద్ వాసులకు మూసీ నది ఒక మురికికాలువే. కానీ ఇపుడా మురికి కంపు కొట్టే మూసీలో వజ్రాలు దాగి ఉన్నాయంటోంది సర్వే. నల్గొండ జిల్లాలోని కృష్ణా నదిలో మూసీ నది కలిసే సంగమ ప్రదేశంలో వజ్రాలు దొరికే అవకాశం ఉందని సూచిస్తున్నాయి ఓయూ యూనివర్సిటీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఇతర సంస్థల పరిశోధకులు చేపట్టిన అధ్యయనాలు. ఈ అధ్యయనాల్లో నల్గొండలో వజ్రాలు ఉన్నట్లు తేలింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మూసీ నది కృష్ణానదిలో కలిసే చోట వజ్రాల గని ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అంటే..హైదరాబాద్‌లోని మూసీ దిగువన, కృష్ణాలో సంగమం చెందే వాడపల్లి వరకు తాను దృష్టి సారించామని ఉస్మానియ వర్శిటీ ప్రొఫెసర్ రామదాస్ తెలిపారు.

అంతేకాదు.. మహబూబ్‌నగర్ జిల్లాలో భీమా నది కృష్ణానదిలో కలిసే ప్రదేశంలో.. గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నది కృష్ణాలో కలిసే ప్రదేశంలో వజ్రాలు కలిగిన కింబర్‌లైట్‌లు, లాంప్రాయిట్‌లు కూడా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ప్రఖ్యాత కోహినూర్‌తో సహా ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన అత్యుత్తమ వజ్రాలలో కొన్ని కృష్ణా నది నుంచే లభించినవే. లాంప్రోయిట్ అనేది అల్ట్రాపోటాసిక్ మాంటిల్-ఉత్పన్నమైన ఒక అగ్నిపర్వత లేదా ఉప-అగ్నిపర్వత శిల. కింబర్‌లైట్‌ అనేది కూడా ఒక అగ్ని శిలే. ఈ రెండు ప్రత్యేకమైన రాళ్ల నుంచి వజ్రాలు వెలికితీయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇటువంటి రాళ్లు/శిలలు కృష్ణా నదిలోను దాని ఉపనదులు సంగమం అయ్యే ప్రదేశంలో ఉండటం విశేషమంటున్నారు పరిశోధకులు.

Read more : BJP MP : రూ.15 లక్షలలోపు అవినీతి చేసివాళ్లను వదిలేయండి…అంతకంటే ఎక్కువైతే నాకు చెప్పండి : బీజేపీ ఎంపీ

ఒకప్పుడు నిజాం నవాబుల కోటగా వర్థిల్లిన గోల్కొండలో వజ్రాలు..విలువైన రత్నాలు ఉండి ఉంటాయనే ఉద్ధేశంత్యో గోల్కొండలో తవ్వకాలు జరిగాయి. కానీ అక్కడ ఏమీ దొరకలేదు. కాకపోతే దక్షిణ భారత వజ్రాల ప్రావిన్స్ లో తవ్విన వజ్రాలను ‘గోల్కొండ వజ్రాలు’ అని అంటారు. తెలంగాణలో ఎన్నో కోటలకు ప్రసిద్ధి చెందింది. ఈకోటల్లో వజ్రవైఢూర్యాలు ఉంటాయనే నమ్మకం ఈనాటికి ఉంది. అందుకే కొంతమంది కేటుగాళ్లు అక్రమంగా తవ్వకాలు జరుపుతుంటుంటారు. కాగా..పరిశోధకులు తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లో అధ్యయనాలు చేపట్టినా..ఆయా ప్రాంతాల్లో ఎటువంటి వజ్రాలు లేవని నిర్ధారించారు ఓయూ జియోఫిజిక్స్ మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి. రామదాస్. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం వజ్రాలు లభ్యం కావచ్చని తమ అధ్యయనంలో తేలిందని తెలిపారు.

ముఖ్యంగా మూసీ కృష్ణానదిలో కలిసే చోట మైనింగ్ చేస్తే వజ్రాలు వెలికి తీసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోని మూసీ దిగువన, కృష్ణాలో సంగమం జరిగే వాడపల్లి వరకు దృష్టి సారించామని తెలిపారు. కృష్ణానదిలో తుంగభద్ర, భీమా, మూసీ నదుల సంగమ ప్రదేశాల్లో వజ్రాలతో కూడిన శిలలు ఉన్నాయని.. కాకపోతే అవి భూమికి చాలా లోతుగా ఉన్నాయని రామదాస్ స్పష్టం చేశారు.

Read more : Doctors Strike : ఢిల్లీలో 2,000మంది డాక్టర్ల సమ్మె..బిడ్డ కోసం కన్నీటితో ఓ తల్లి ఆవేదన..

సౌత్ ఇండియన్ డైమండ్ ప్రావిన్స్ (SIDP) తెలుగు రాష్ట్రాల మీదుగా ఉంది. ఇందులో డెక్కన్ కింబర్‌లైట్ ఫీల్డ్, వజ్రకరూర్ కింబర్‌లైట్ ఫీల్డ్, మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట నుంచి కర్ణాటకలోని గుల్బర్గా వరకు విస్తరించి ఉన్న కింబర్‌లైట్ ఫీల్డ్, కర్ణాటకలోని మహబూబ్‌నగర్.. రాయచూర్‌ను కవర్ చేసే రాయచూర్ కింబర్‌లైట్ ఫీల్డ్ ఉన్నాయి. ఓ ప్రాంతంలో ఓ రైతు తాను వజ్రాన్ని కనుగొన్నానని చెప్పడంతో.. తమ బృందం రంగారెడ్డిలోని అమంగల్‌లో అధ్యయనం చేసామని..తమ పరిశోధనలో అమంగల్‌లో డైమండ్ జోన్‌లు లేవని తేలిందని వెల్లడించారు.

కల్వకుర్తి మండలంలో వజ్రాలు ఉన్నాయని రామదాస్ రీసెర్చ్ లో తేలిందని తెలిపారు. “ఈ ప్రాంతంలో డైమండ్‌ల ఉనికిని సూచించే డైక్‌లు, ఫాల్ట్ కాంటాక్ట్ పరిసరాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గతంలో..పరిశోధకులు కృష్ణా బేసిన్‌లోని మిర్యాలగూడలోని రామన్నపేట-ఉస్తాపల్లి లాంప్రోయిట్ బాడీ వద్ద వజ్రాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నట్లు కనుగొన్నారు.