Doctors Strike : ఢిల్లీలో 2,000మంది డాక్టర్ల సమ్మె..బిడ్డ కోసం కన్నీటితో ఓ తల్లి ఆవేదన..

ఢిల్లీలో ప్రభుత్వ డాక్టర్లు సమ్మె చేపట్టి 12 రోజులైంది. ఎమర్జెన్సీసేవలను కూడా బహిష్కరించారు. దీంతో అస్వస్థతతో ఉన్నబిడ్డ కోసం ఓ తల్లి కన్నీటివేదన ఇది.

Doctors Strike : ఢిల్లీలో 2,000మంది డాక్టర్ల సమ్మె..బిడ్డ కోసం కన్నీటితో ఓ తల్లి ఆవేదన..

Doctors Strike In Delhi

Doctors Strike In Delhi :  ఢిల్లీలో ప్రభుత్వ డాక్టర్లు సమ్మె చేపట్టి 12 రోజులైంది. నగర వ్యాప్తంగా ఉన్న 20 ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. ఎమర్జెన్సీ, ఓపీడీ సేవలను కూడా డాక్టర్లు బహిష్కరించారు.దీంతో ఆస్పత్రి బయట రోగుల బారులు తీరింది.దీంతో రోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ తల్లి అస్వస్థతగా ఉన్న తనబిడ్డను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. కానీ ఆమెను పట్టించుకున్నవారే లేరు.

Read more : Mandela cell key auction : నెల్సన్‌ మండేలా జైలుగది తాళంచెవి వేలం..జాతి సంపదల వేలం ఆపాలని సౌతాఫ్రికా డిమాండ్

‘దేవుళ్లలాంటి డాక్టర్లు మాలాంటి పేద రోగుల్ని పట్టించుకోకపోతే మా గతి ఏంటీ సారు..నా బిడ్డను తీసుకుని వేరే ఆస్పత్రికి పోవాలని చెబుతున్నారు..నేనే ఏడకని పోయేది సారు’’అంటూ కన్నీటితో ఆవేదన వ్యక్తంచేసింది. నా బిడ్డ పరిస్థితి ఏంటి..పెద్ద పెద్ద ఆస్పత్రులకు మాలాంటి పేదోళ్లు వెళ్లలేం కదా సారు కాస్త కనికరించండి అంటూ వేడుకుంటున్న ఆ తల్లి ఆవేదనను ఓ మీడియా కవల్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో అవి వైరల్ అయ్యాయి. కన్నీటితో బిడ్డను ఏమైపోతుందనే అనే ఆవేదన ఆ తల్లి దీన పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు. డాక్టర్ల సమ్మెలో న్యాయమే ఉండొచ్చు..కానీ ఇటువంటి పేదవారి పరిస్థితి డాక్టర్ల సమ్మెతో ప్రశ్నార్థకంగా మారటం విచారకరమని అంటున్నారు నెటిజన్లు..

Read more : Covid-19 : విద్యాశాఖ మంత్రికి క‌రోనా పాజిటివ్..
కాగా..తమ కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన సమ్మె ప్రారంభించి 12 రోజులవుతోంది. పని ప్రదేశాల్లో భద్రత, కనీస మౌలిక అవసరాలు, సమయానికి జీతభత్యాల చెల్లింపు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వారు పోరాటానికి దిగారు.

ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న సుమారు 20 ఆసుపత్రులకు చెందిన ప్రభుత్వ వైద్యులు సుమారు 2000 మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో వైద్యసేవలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా సఫ్దర్ జంగ్, మౌలానా అజాద్, రామ్ మనోహర్ లోహియా తదితర ఆసుపత్రులలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్య సేవల విభాగంలో మాత్రమే రోగులకు సేవలందిస్తుండగా నిన్నటి నుంచి ఎమర్జన్సీ సేవల్ని కూడా బహిష్కరించారు డాక్టర్లు.