Covid-19 : విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్..
విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావటంతో ఆమె సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

Maharashtra Minister Tests Positive For Covid 19 Read More At Https Www.aninews.in News National General News Maharashtra Minister Tests Positive For Covid 1920211228111624
Maharashtra Minister tests positive for COVID-19 : మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో స్కూల్ విద్యాశాఖ మంత్రి కరోనాకు గురయ్యారు. విద్యాశాఖ మంత్రి వర్ష ఏక్‌నాథ్ గైక్వాడ్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆమెకు స్వల్పంగా జ్వరం రావడంతో వర్ష ఏక్‌నాథ్ సోమవారం (డిసెంబర్ 27,12,2021)సాయంత్రం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. తనకు కరోనా పాజిటివ్ అని మంత్రే స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.
Read more : Sonia Gandhi : సోనియాకు చేదు అనుభవం.. జారిపడ్డ జెండా
సోమవారం సాయంత్రం కాస్త జ్వరం ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని..పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆమె తెలిపారు. నాకు ఎటువంటి ఇబ్బందిలేదని..క్షేమంగానే ఉన్నానని వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని..ముందుజాగ్రత్త చర్యగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నానని పూర్తిగా కోలుకున్నాక బయటకు వస్తానని తెలిపారు. కాగా..ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో తనతో సన్నిహితంగా మెలిగిన కార్యకర్తలు, అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి వర్ష ఏక్‌నాథ్ గైక్వాడ్ కోరారు.
Read more : 80 Students Sick : మధ్యాహ్న భోజనంలో బల్లి.. 80 మంది విద్యార్థులు అస్వస్థత