Mandela cell key auction : నెల్సన్‌ మండేలా జైలుగది తాళంచెవి వేలం..జాతి సంపదల వేలం ఆపాలని సౌతాఫ్రికా డిమాండ్

నల్లజాతి సూర్యుడిగా ప్రసిద్ది చెందిన నెల్సన్‌ మండేలా శిక్ష అనుభవించిన జైలుగది తాళం చెవిని వేలానికి పెట్టారు. మండేలా జ్ఞాపికలను జాతిసంపదలని వాటివేలం ఆపాలని సౌతాఫ్రికా డిమాండ్

Mandela cell key auction : నెల్సన్‌ మండేలా జైలుగది తాళంచెవి వేలం..జాతి సంపదల వేలం ఆపాలని సౌతాఫ్రికా డిమాండ్

Nelson Mandela Cell Key Auction

Nelson Mandela cell key auction :  నెల్సన్‌ మండేలా. అంటే గుండెలు మండేలా అనే మాటే గుర్తుకొస్తుంది. నల్లజాతి సూరీడు జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నాయకుడు మండేలా. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. సౌతాఫ్రికా పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. ఆయన దేశాధ్యక్షుడు కాకముందు జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు. ఆయన 18 ఏళ్లపాటు కారాగార శిక్ష అనుభవించిన జైలు గది తాళం చెవిని అమెరికాలో జనవరి 28న వేలం వేయనుంది. ఈ వేలాన్ని దక్షిణాఫ్రికా తీవ్రంగా వ్యతిరేకించింది. నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య బద్ధంగా అధ్యక్షుడైన తొలి నాయకుడు జైలు జీవితం గడిపిన గది తాలూకూ వస్తువులన్నీ జాతి సంపదలని దక్షిణాఫ్రికా ప్రకటించింది. అమెరికాలో జనవరి 28న గ్వెర్న్సీ వేలం హౌస్ ఈ తాళం చెవిని వేలం వేయనుంది.ఈ వేలన్ని నిలిపివేయాలని సౌతాఫ్రికా డిమాండ్‌ చేసింది.

Read more : Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లు

మా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా వేలంవేయడమేంటి? అని దక్షిణాఫ్రికా క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి నాథి ఎంతెత్వా ప్రశ్నించారు. నెల్సన్ మండేలా ధరించిన కళ్లజోడు, పెన్నులు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్, ఐక్యరాజ్యసమితి నుంచి అందుకున్న జ్ఞాపికలను వేలానికి పెట్టారు. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. వేలానికి పెట్టిన మండేలా వస్తువులను తిరిగి దేశానికి తెస్తామని తెలిపారు.

కాగా నెల్సన్ మండేలాకు విధించిన 27 ఏళ్ల కారాగార శిక్షలో 18 ఏళ్లు రాబిన్‌ ద్వీపంలోని జైలులో ఒకే గదిలో గడిపారు. ఆ కాలంలో ఆ జైలుకు జైలర్‌గా క్రిస్టో బ్రాండ్‌ ఉన్నాడు. ఈ జైలు శిక్షలో భాగంగా మండేలాకు జైలర్ క్రిస్టోకు మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత క్రిస్టో రాబిన్‌ ద్వీపానికి టూర్‌ గైడ్‌గా మారాడు. ప్రస్తుతం ఆ జైలును పురావస్తుశాలగా మార్చారు. అయితే, మండేలా ఉన్న గది తాళం చెవి డూప్లికేట్‌ ఒకటి క్రిస్టో వద్దకు చేరింది.

Read more : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఆ డూప్లికేట్‌ తాళం చెవిని అమెరికాకు చెందిన గెన్సీస్‌ ఆక్షన్స్‌ అనే వేలం సంస్థకు విక్రయించాడు క్రిస్టో. నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత, మహోన్నతమైన మండేలా గడిపిన గది తాలూకు తాళం చెవి కావడంతో అది రూ.10 కోట్లకుపైగా ధర పలకవచ్చని అంచనాలున్నాయి. ఆ జైలుగది చెందిన అసలైన తాళం చెవి జైలులోనే ఉందని..కానీ డూప్లికేట్‌ తాళం చెవిని వేలం వేయటానికి ఒడిగట్టిన అధికారులు ఎవరనేది తేలుస్తామని దక్షిణాఫ్రికా క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి నాథి ఎంతెత్వా చెప్పారు.

నెల్సన్ మండేలా పూర్తి పేరు నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా. తెంబు వంశానికి చెందిన నెల్సన్ మండేలా జూలై 18 , 1918లో జన్మించారు. వారి కుటుంబంలో బడికి వెళ్ళిన మొదటి వ్యక్తి మండేలానే. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు “రోబెన్” అనే ద్వీపంలో కారాగార శిక్షననుభవించారు మండేలా. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో మండేలా ఒకరు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి అభివర్ణించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచాడు.

Read more : Lionel Messi: ముక్కు,మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్‌ ధర రూ. 7.5 కోట్లు

1990 ఫిబ్రవరి 11లో కారాగారం నుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశారు. వందకు పైగా పురస్కారాలు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో చూస్తారు. 2013లో డిసెంబర్ 5న నల్లజాతి సూర్యుడు అస్తమించారు.