Lionel Messi: ముక్కు,మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్‌ ధర రూ. 7.5 కోట్లు

ముక్కు, మూతి తుడుచుకున్న ఓ టిష్యూ పేపర్ ధర ఏకంగా రూ.705 కోట్లు..! ఏంటీ షాక్ అయ్యారా?..

Lionel Messi: ముక్కు,మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్‌ ధర రూ. 7.5 కోట్లు

Lionel Messi Used Tissue Auctioned For Rs.7.5 Crore

Lionel Messi Used Tissue Auctioned For Rs.7.5 Crore : ఓ టిష్యూ పేపర్ ధర ఏకంగా రూ.705 కోట్లు..! ఏంటీ షాక్ అయ్యారా? అవ్వకేం చేస్తాం..కానీ ఇది నిజమే. ఏంటీ టిష్యూ ఏమన్నా బంగారంతో చేసిందా? వజ్రాలతో తయారుచేసిందా? అనే డౌట్ కూడా రావచ్చు.నిజంగా బంగారం, వజ్రాలతో చేసినా అంత ధర ఉండదు.కానీ ఓ టిష్యూ పేపర్ ధరను ఓ ప్రబుద్ధుడు ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో లో వేలానికి పెట్టి దాని ధరను రూ.ఏడున్నర కోట్లుగా పెట్టాడు. ఇంతకీ ఆ టిష్యూ పేపర్ ధరకు వెనుక ఉన్న అసలు కథ ఏంటీ అంటే..

పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాడిని వస్తువులు వేలంలో కోట్ల రూపాయల ధర పలుకుతుంటాయనే విషయం తెలిసిందే. ఇదిగో ఈ టిష్యూ పేపర్ వెనుక కూడా ఓ సెలబ్రిటీ ఉన్నాడు. అతను ఏ రాజవంశానికి చెందినవాడో కాదు. అంతకంటే ఎక్కువ క్రేజ్ కలిగిన ఫుట్ బాల్ ప్లేయర్ ‘లియోనల్‌ మెస్సీ’. అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ.లియోనల్‌ మెస్సీ ఇటీవలే కాంట్రాక్ట్‌ పొడిగింపులో వచ్చిన సమస్యల నేపథ్యంలో ఫుట్‌బాల్‌ క్లబ్‌ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెస్సీ గత ఆదివారం(ఆగస్టు 8,2021) జరిగిన ఫేర్‌వెల్‌ వేడుకలో పాల్గొన్నాడు. ఈ వేడుకల్లో మెస్సీ తన అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా కొన్ని మాటలు చెబుతూ మెస్సీ ఎమోషనల్‌ అయ్యాడు. కన్నీరు పెట్టుకున్నారు. ఈ కన్నీళ్లను ఓ టిష్యూ పేపర్ తో తుడుచుకున్నాడు. మాట్లాడుతుండగా ఉద్వేగం ఆపుకోలేక ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాటు ముక్కు కూడా తుడుచుకున్నాడు. ఆ తరువాత ఆ టిష్యూ పేపర్ గురించి మెస్సీ పట్టించుకోలేదు. ఎవరైనా అంతే మరి వాడిపారేసిన వాటి గురించి పట్టించుకుంటారేంటీ?..

అలా మెస్సీ..కన్నీళ్లు తుడుచుకున్న ఈ టిష్యూ పేపర్‌పై ఓ ప్రబుద్ధుడి కళ్లు పడ్డాయి. సదరు వ్యక్తి ఆ టిష్యూని తీసుకొని దాచిపెట్టుకున్నాడు. అలా దాచిపెట్టిన ఆ టిష్యూని ఏకంగా ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో లో వేలానికి పెట్టాడు. ప్రముఖ ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు అక్షరాల 1 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. ఏడున్నర కోట్లు ధర నిర్ణయించాడు. ఇంకేముంది ఆ టిష్యూ పేపర్ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.మరి తనను వాడింది ఓ ఫుట్ బాట్ ప్లేయర్ మరి. ఓ టిష్యూ పేపర్ ధర విషయం తెలుసుకున్న అభిమానులు ”వార్ని.. మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌కు ఇంత రేటా?!” అంటూ నోరు వెళ్లబెడుతున్నారు.

13 ఏళ్ల వ‌య‌సులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. 17 సీజ‌న్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ త‌ర‌ఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర క్రియేట్ చేశాడు. బార్సిలోనా క్లబ్‌ను వీడిన మెస్సీ తాజాగా పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ (పీఎస్‌జీ)కి ఆడనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్‌ క్లబ్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ తో రెండేళ్లు అగ్రిమెంట్ చేసుకున్నాడు.రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. మరి సెలబ్రిటీలకు ఇచ్చే అగ్రిమెంట్ల ఫిగర్ చాలా సీక్రెట్ గా ఉంటుందిగా..