Telangana Corona News : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. రోజువారీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల

తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరో రోజు 300ల లోపే కేసులు వచ్చాయి. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

Telangana Corona News : తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరో రోజు 300ల లోపే కేసులు వచ్చాయి. అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 17వేల 521 మందికి కరోనా పరీక్షలు చేయగా, 265 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 142 కేసులు వచ్చాయి. కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 15 చొప్పున కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 29వేల 467 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 22వేల 173 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల 183కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 18వేల 791 మందికి కరోనా పరీక్షలు చేయగా, 291 మందికి పాజిటివ్ గా తేలింది.

 

తెలంగాణ కరోనా బులెటిన్..

ట్రెండింగ్ వార్తలు