Telangana EAMCET 2022 Results: రేపు తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

రేపు తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల కానుండగా, 11.45 గంటలకు ఎంసెట్‌ ఫలితాలు విడుదల అవుతాయని అధికారులు ప్రకటించారు. విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను eamcet.tsche.ac.inలో చూసుకోవచ్చు. అలాగే, ఈ సెట్ ఫలితాలను ecet.tsche.ac.inలో విద్యార్థులు పొందవచ్చు.

AP Inter Results

Telangana EAMCET 2022 Results: రేపు తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల కానుండగా, 11.45 గంటలకు ఎంసెట్‌ ఫలితాలు విడుదల అవుతాయని అధికారులు ప్రకటించారు. విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను eamcet.tsche.ac.inలో చూసుకోవచ్చు. అలాగే, ఈ సెట్ ఫలితాలను ecet.tsche.ac.inలో విద్యార్థులు పొందవచ్చు.

తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జూలై 18 నుంచి 21 వరకు, అగ్రికల్చర్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు 30, 31న ఎంసెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి ఇంజనీరింగ్‌ పరీక్షను 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షను 80,575 మంది విద్యార్థులు రాశారు. ఇఫ్పటికే కీ విడుదల చేశారు. ఫలితాలను ఎంసెట్‌ కమిటీ ఇవాళ విశ్లేషించింది.

రేపు ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. eamcet.tsche.ac.inలో విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబరును ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు బీటెక్ రెండో ఏడాదిలో చేరడానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను కూడా ecet.tsche.ac.inలో విద్యార్థులు హాట్ టికెట్ నంబరు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

China-Taiwan conflict: యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయన్న చైనా.. సైనిక విన్యాసాలు చేపట్టిన తైవాన్