China-Taiwan conflict: యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయన్న చైనా.. సైనిక విన్యాసాలు చేపట్టిన తైవాన్

చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చైనా చేపట్టిన సైనిక విన్యాసాలకు దీటుగా తైవాన్ కూడా యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. ఇవాళ తైవాన్ సైన్యం మరోసారి పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటించిన నేపథ్యంలో దీనిపై చైనా మండిపడుతూ ఇటీవల పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. చైనా సైనిక విన్యాసాలు ముగిశాయి. అయితే, యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయని చైనా ప్రకటించింది. చైనా మళ్ళీ ఎలాంటి చర్యలకైనా పాల్పడవచ్చని తైవాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తమ దేశాన్ని రక్షించుకునేందుకు సన్నద్ధమయ్యేలా యుద్ధ విన్యాసాలు చేపట్టామని తైవాన్ తెలిపింది. 

China-Taiwan conflict: యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయన్న చైనా.. సైనిక విన్యాసాలు చేపట్టిన తైవాన్

China-Taiwan conflict

China-Taiwan conflict: చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. చైనా చేపట్టిన సైనిక విన్యాసాలకు దీటుగా తైవాన్ కూడా యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. ఇవాళ తైవాన్ సైన్యం మరోసారి పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటించిన నేపథ్యంలో దీనిపై చైనా మండిపడుతూ ఇటీవల పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. చైనా సైనిక విన్యాసాలు ముగిశాయి. అయితే, యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయని చైనా ప్రకటించింది. చైనా మళ్ళీ ఎలాంటి చర్యలకైనా పాల్పడవచ్చని తైవాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తమ దేశాన్ని రక్షించుకునేందుకు సన్నద్ధమయ్యేలా యుద్ధ విన్యాసాలు చేపట్టామని తైవాన్ తెలిపింది.

ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తమ దేశాన్ని రక్షించుకునేందుకు సన్నద్ధమయ్యేలా యుద్ధ విన్యాసాలు చేపట్టామని తైవాన్ తెలిపింది. తైవాన్ లోని పింగ్టుంగ్ కౌంటీలో ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి దాదాపు గంట సేపు యుద్ధ విన్యాసాలు చేపట్టామని తైవాన్ పేర్కొంది. పింగ్టుంగ్ కౌంటీలో రెండు రోజుల క్రితం కూడా తైవాన్ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. వందలాది మంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. షెడ్యూలు ప్రకారమే తాము సైనిక విన్యాసాలు చేపట్టామని, అంతేగానీ, చైనా యుద్ధ సన్నాహక చర్యలకు ప్రతిస్పందనగా కాదని తైవాన్ పేర్కొంది.

తమ యుద్ధ సామగ్రి సమర్థంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ విన్యాసాలు చేపట్టినట్లు చెప్పింది. కాగా, తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు ముగిశాయని చైనా ప్రకటన చేసింది. తమ సైన్యం సమర్థంగా పనిని ముగించిందని చెప్పింది. అయినప్పటికీ, మిలటరీ శిక్షణ, యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయని చైనా ప్రకటించడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ సమాజం తైవాన్ కు మద్దతు తెలుపుతుందని తాము ఆశిస్తున్నామని రెండు రోజుల క్రితమే తైవాన్ ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా పాల్పడుతోన్న బాధ్యతారాహిత్య చర్యలకు, బెదిరింపులకు ముగింపు పలికేలా ప్రపంచ సమాజం స్పందించాలని కోరింది.

చైనా చర్యలకు ముగింపు పలికేలా చేసి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. చైనా చేపట్టిన సైనిక విన్యాసాలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ దేశ హక్కులను ఉల్లంఘించడమేనని చెప్పింది. చైనా పాల్పడుతోన్న చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. తమ దేశంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటనను సాకుగా చూపెడుతూ చైనా యుద్ధ విన్యాసాలకు పాల్పడుతోందని, నిజానికి డ్రాగన్ దేశ ఉద్దేశం వేరే ఉందని తైవాన్ చెప్పింది.

Raksha bandhan Gift: తమ్ముడికి కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి ప్రాణాలు కాపాడిన అక్క