విద్యార్థులకు గమనిక : TS EAMCET పరీక్ష డేట్ ఫిక్స్!

  • Publish Date - May 13, 2020 / 12:33 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు విద్యాధికారులు కసరత్తు జరుపుతున్నారు. కరోనా వైరస్ కారణంగా పలు పరీక్షలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కానీ జులై నాటికి వైరస్ అదుపులో వస్తుందని అధికారులు భావిస్తున్నారు. జులై మొదటి వారంలోనే పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తులు జరుపుతున్నారు. ఇతర పరీక్షలకు ఇబ్బంది కలుగకుండా ఉండాలంటే జులై 06వ తేదీ నుంచి ఎంసెట్ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 

జులై 18 నుంచి 23 వరకు JEE Mains పరీక్షలు, ఇదే నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష జరుగనుంది. ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్, తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ పరీక్షలు రాస్తారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జులై 06 నుంచి పరీక్షలు ప్రారంభించి..జులై 15 లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇలా చేస్తే…18వ తేదీ నుంచి జరిగే…JEE Mains పరీక్షలకు సిద్ధం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. 

ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు JEE Mains కు హాజరవుతుంటారు. మూడు సెట్స్ తేదీలు క్లాష్ కాకుండా…జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అందుకే జులై మొదటి వారంలోనే పరీక్ష నిర్వహించేలా అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. జులై కరోనా అదుపులోకి రాకుంటే..మాత్రం…ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ ఎంసెట్ నిర్వహించాల్సి వస్తుందని అంచనా. 

మరోవైపు…జూలై 18 నుంచి 23 వరకు జరిగే JEE Mains పరీక్షల ఫలితాలు జూలై 31 నాటికి వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించ వద్దని భావిస్తున్నారు. మొత్తానికి ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ చేపడితే ఇబ్బంది ఉండదన్న భావనతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 

Read Here>> తెలంగాణలో మే లోనే టెన్త్ పరీక్షలు, ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టండి

ట్రెండింగ్ వార్తలు