Telangana : త్వరలో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు రూ.10 లక్షలు
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. దళితబంధు మాదిరిగానే త్వరలో అన్ని వర్గాలలోని కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందచేస్తామని తెలిపారు.
- kunduru Vinod
- Published On : August 24, 2021 / 08:02 PM IST
Telangana
Telangana : సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. దళితబంధు మాదిరిగానే త్వరలో అన్ని వర్గాలలోని కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందచేస్తామని తెలిపారు. తెలంగాణలో పేదరికం అనే దరిద్రాన్ని తరిమికొట్టడమే తమ లక్ష్యం అని కేసీఆర్ అన్నారు.
తాజాగా జరిగిన రాష్ట్రకమిటీ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో 20 ఏళ్ళు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని తెలిపారు. అన్ని వర్గాల్లోని పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు.
మరోవైపు రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యాలయాలను సీఎం అక్టోబర్ లో ప్రారంభించనున్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేయనున్న టీఆర్ఎస్ కార్యాలయానికి సెప్టెంబర్ 2న భూమి పూజ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇక కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంపై కేటీఆర్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎన్నికల ప్రస్తావన రాలేదని ఆయన తెలిపారు.
