TS Covid Update
TS Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 181 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 203 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.84 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది.
దీంతో రాష్ట్రంలో ఇంతవరకు 6,79,245 మందికి కొవిడ్ సోకగా, వారిలో 6,71,450 మంది చికిత్స పొంది కోలుకున్నారు. ఇలా ఉండగా, గడచిన 24 గంటల్లో ఒకరు కోవిడ్ తో మరణించటంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,013 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,782 క్రియాశీల కేసులు ఉన్నాయి.
జీహెచ్ ఎంసీ పరిధిలో ఈరోజు కొత్తగా 84కోవిడ్ కేసులు నమోదు కాగా…హనుమకొండలో 14, రంగారెడ్డి జిల్లాలో 13,యాదాద్రిభువనగిరి జిల్లాలో 9, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Also Read : Thiruppavai At Srivari Temple : శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్ధానంలో తిరుప్పావై
మరోవైపు రాష్ట్రంలో 8 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు చెప్పారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని..97 శాతం మంది ప్రజలుమొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారని ఆయన చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని ఆయన కోరారు. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఏడుగురు వ్యాక్సినే వేయించుకోలేదని… కావున ప్రజలంతా తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.