Film Chamber : నేడు రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లతో ఫిలిం ఛాంబర్ సమావేశం.. టికెట్ రేట్ల మీదేనా??

నేడు ఆగస్టు 7న ఫిలిం ఛాంబర్ లో ఉదయం 11 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల సినిమా డిస్ట్రిబ్యూటర్లతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో............

Film Chamber :  టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం వరుస సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సమస్యలకి పరిష్కారం దొరికేదాకా షూటింగ్స్ నిలిపివేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్.. ఇలా పలు సంఘాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. టాలీవుడ్ సమస్యలకి, జనాలని థియేటర్లకు రప్పించడానికి పరిష్కారాలు వెతుకుతున్నాయి.

ఇటీవలే ఫిలిం ఛాంబర్ మల్టీప్లెక్స్ ప్రతినిధులతో టికెట్ రేట్లపై, స్నాక్స్ రేట్లపై సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు ఆగస్టు 7న ఫిలిం ఛాంబర్ లో ఉదయం 11 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల సినిమా డిస్ట్రిబ్యూటర్లతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పర్సెంటేజ్ విధానం, విపిఎఫ్ చార్జీలు, టికెట్ రేట్ల గురించి చర్చించనున్నట్టు సమాచారం.

Naga Chaitanya : నేను మళ్ళీ ప్రేమలో పడతాను.. బతకడానికి ఊపిరి ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే..

రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అయిపోయిన తర్వాత నేడు మధ్యాహ్నం మూడు గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీతో డిస్ట్రిబ్యూటర్ల కమిటీ మరో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం మంచి ఫలితాలని ఇస్తుందని ఆశిస్తున్నారు. టికెట్ రేట్లు తగ్గించే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు