Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీరులో సోమవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కశ్మీరులోని కుల్గాం జిల్లాలోని హూరా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ పోలీసుకు గాయాలయ్యాయి....

Jammu And Kashmir Encounter

Jammu And Kashmir Encounter : జమ్మూకశ్మీరులో సోమవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కశ్మీరులోని కుల్గాం జిల్లాలోని హూరా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ పోలీసుకు గాయాలయ్యాయి.(Jammu And Kashmir’s Kulgam) గాయపడిన పోలీసును ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్ స్థలంలో మరణించిన ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Thanks Wagner Fighters : రష్యాలో రక్తపాతాన్ని నివారించినందుకు వాగ్నర్ ఫైటర్స్‌కు పుతిన్ కృతజ్ఞతలు

కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం మంగళవారం కూడా గాలింపు కొనసాగిస్తున్నామని జమ్మూకశ్మీరు పోలీసులు ట్వీట్ చేశారు. మరణించిన ఉగ్రవాది ఏ గ్రూపునకు చెందిన వ్యక్తి అనేది ఇంకా తేలలేదు.

Man Defecates On Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి మలవిసర్జన..అరెస్ట్

సరిహద్దుల్లో పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబాటు యత్నం చేస్తున్న నేపథ్యంలో కుల్గాం జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని కాలా జంగల్ వద్ద ఐదుగురు పాక్ ఉగ్రవాదులు భారత దేశంలో చొరబడుతుండగా జరిపిన కాల్పుల్లో వారు మరణించారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి చొరబాట్లు సాగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు