Beast : దళపతి సెకండ్ లుక్.. ‘అరాచకం’ అంటున్న అభిమానులు..

విజయ్ బర్త్‌డే రోజు అర్థరాత్రి 12 గంటలకు దళపతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బీస్ట్’ సెకండ్ లుక్ వదిలారు..

Beast : దళపతి సెకండ్ లుక్.. ‘అరాచకం’ అంటున్న అభిమానులు..

Thalapathy Vijay Beast Movie Second Look

Updated On : November 11, 2021 / 6:36 PM IST

Beast: జూన్ 22 ఇళయ దళపతి విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా జూన్ 21 సాయంత్రం విజయ్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బీస్ట్’ అనే టైటిల్‌తో పాటు, ఒకే ఒక్క లుక్‌తో తన ఫ్యాన్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు విజయ్.

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది. దళపతి 65వ సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

Vijay – Beast First Look : దళపతి కొత్త సినిమా ‘బీస్ట్’.. ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్..

విజయ్ బర్త్‌డే రోజు అర్థరాత్రి 12 గంటలకు దళపతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘బీస్ట్’ సెకండ్ లుక్ వదిలారు. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో.. బనియన్‌ వేసుకుని, రఫ్ లుక్‌లో, చేతితో గన్‌తో కనిపించిన విజయ్.. సెకండ్ లుక్‌ పోస్టర్‌‌లో నోట్లో బుల్లెట్, చేతిలో గన్‌తో కనిపించి ఆకట్టుకున్నారు.

#BeastSecondLook! #HBDThalapathyVijay #HappyBirthdayThalapathyVijay #HBDThalapathy ట్విట్టర్‌లో ఈ హ్యాష్ ట్యాగ్లతో దళపతి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ పోస్టర్లతో సోషల్ మీడియా మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు తమిళ తంబీలు.