Egypt President India Tour: మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు భారత్‌కు రానున్న ఈజిప్టు ప్రధాని ..

అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ఈజిప్టు అధ్యక్షుడి హోదాలో ఇండియాకు రావటం ఇది మూడోసారి. అక్టోబర్ 2015లో మూడవ ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చారు. 2016 సెప్టెంబర్‌లో రాష్ట్ర పర్యటనలో పాల్గొనేందుకు ఇండియా వచ్చారు. ప్రస్తుతం మూడోసారి 74వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఇండియాకు వస్తున్నారు.

Egypt President India Tour: ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ నేడు భారత్ రానున్నారు. దేశంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం ఢిల్లీకి చేరుకుంటారు. రేపటి నుంచి ఆయన అధికారిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. భారతదేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని అబ్దెల్ ఫతాహ్ ఎల్ -సీసీని కేంద్రం ఆహ్వానించిన విషయం విధితమే. అయితే, ఆయన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రావటం ఇదే తొలిసారి. ఈజిప్టు అధ్యక్షుడి వెంట ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంటుంది.

Republic Day Egypt President : భారత రిపబ్లిక్‌డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షులు.. ఇదే తొలిసారి

అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ఈజిప్టు అధ్యక్షుడి హోదాలో ఇండియాకు రావటం ఇది మూడోసారి. అక్టోబర్ 2015లో మూడవ ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చారు. 2016 సెప్టెంబర్‌లో రాష్ట్ర పర్యటనలో పాల్గొనేందుకు ఇండియా వచ్చారు. ఆ తరువాత మళ్లీ నేడు ఆయన భారత్‌లో అడుగు పెట్టనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రేపు (బుధవారం) రాష్ట్రపతి భవన్ ప్రెసిడెంట్ సీసీకి లాంఛనంగా స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు సాయంత్రం ప్రముఖుల గౌరవార్ధం విందు ఇస్తారు. 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఈజిప్టు ప్రధాని ముఖ్యఅతిథిగా పాల్గోనున్నారు.

 

ఈజిప్ట్ ప్రధాని పర్యటన సందర్భంగా ఇరుదేశాల రక్షణ, వ్యవసాయ సబంధాలను బలోపేతం చేసేందుకు దృపెట్టనున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈజిప్టుకు భారత్ తొలిసారిగా గోధుములను (సుమారు 61వేల టన్నుల) ఎగుమతి చేసింది. ఇంతకుముందు భారత గోధుమలపై ఈజిప్టు నిషేదం విధించిన విషయం విధితమే. రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా దేశంలో గుధుమల కొరత ఏర్పడటంతో ఆ నిషేధాన్ని ఈజిప్టు ఎత్తివేసింది. ఇదిలాఉంటే 2022- 23లో భారతదేశం జీ-20 అధ్యక్ష హోదాలో ఫిబ్రవరిలో బెంగళూరులో జరగనున్న ఎయిర్ ఇండియా ఈవెంట్ కోసం ఈజిప్టు అధ్యక్షుడికి ఆహ్వానం పలికిన విషయం విధితమే. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు