Republic Day Egypt President : భారత రిపబ్లిక్‌డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షులు.. ఇదే తొలిసారి

వచ్చే ఏడాది జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్ అల్‌ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Republic Day Egypt President : భారత రిపబ్లిక్‌డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షులు.. ఇదే తొలిసారి

abdel fattah al sisi

Updated On : November 27, 2022 / 2:48 PM IST

Republic Day Egypt President : వచ్చే ఏడాది జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్ అల్‌ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం (నవంబర్ 27,2022) ఒక ప్రకటనలో పేర్కొంది.

భారత రిపబ్లిక్‌ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరుకావడం ఇదే తొలిసారి. భారత్‌-ఈజిప్టు దేశాల మధ్య గత ఏడున్నర దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల రెండు దేశాలు 75వ వార్షికోత్సవాలు కూడా జరుపుకున్నాయి.

Google Doodle: భారత గణతంత్ర దినోత్సవం.. ప్రత్యేక గూగుల్ డూడుల్ చూశారా?

కాగా, ప్రతి ఏడాది భారత గణతంత్ర వేడుకలకు విదేశీ అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరుకావడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ముఖ్య అతిథులుగా ఎవరు కూడా హాజరుకాలేదు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్‌ ఫతాహ్ అల్‌ సిసి ముఖ్య అతిథిగా రానున్నారు.