KrishnaLanka : అలజడి సృష్టిస్తున్న ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ వీడియో…
పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కృష్ణలంక’..

The Fierce And Dreadful The Intro Of Krishnalanka
KrishnaLanka: ‘రంగు’ సినిమాతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కార్తికేయ దర్శకత్వంలో పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కృష్ణలంక’.. నిర్మాత పూనా సోహ్లా పుట్టిన రోజు సందర్భంగా ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ వీడియో విడుదల చేసింది టీం.
టీజర్‌లు, ట్రైలర్‌లకు భిన్నంగా ప్రతీ క్యారెక్టర్ యెక్క ఎమోషన్‌ని పలికించిన ఈ మూడు నిమిషాల వీడియోలో అన్ని పాత్రలు తీరు తెన్నులను పరిచయం చేసాడు దర్శకుడు. హైటెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించిన ‘కృష్ణలంక’, ప్రేమకు పగకు మధ్య జరిగే యుద్ధాన్ని పరిచయం చేసింది. పరుచూరి వెంకటేశ్వరావు కుమారుడు పరుచూరి రవి పాత్ర ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతా కొత్త వారితో కార్తికేయ ఈ సినిమాను మలిచిన తీరుకి అందరూ ప్రశంశలు కురిపిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో కంప్లీట్ అయిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ : ‘‘ఇది ఎమోషనల్ క్రైమ్ డ్రామా… ప్రేమ, స్నేహాం, పగ వంటి భావోద్వేగాలతో నడిచే ఈకథలో ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. చాలా రియలిస్టిక్‌గా కథనం ఉంటుంది. హీరోయిన్ క్యాథలిన్ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ చుట్టూ కథనం సాగుతుంది. ఇందులో హీరోలుగా చేసిన నరేష్, ఆదర్శ్, పెద్దిరాజు పాత్రలు చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. పరుచూరి రవి పాత్రలో ఉండే మాస్ అప్పీల్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ లో సినిమాలోని ప్రతి పాత్రను పరిచయం చేయడం జరిగింది. ఆయా పాత్రల తాలూకు ఎమోషన్‌ని చూపించాం.. ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఎమోషన్‌ని ఎలివేట్ చేసాడు. కథ, కథనాలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. పరిచూరి బ్రదర్స్ నాకు గాఢ్ పాదర్ లాంటి వారు.. ఈ కథ చెప్పగానే పరుచూరి వెంకటేశ్వరావు గారు ఇచ్చిన ప్రోత్సాహాం ఎప్పటికీ మర్చిపోలేను. కొన్ని డైలాగ్స్ వారు మాత్రమే రాయగలరు అనేంతగా వచ్చాయి. ‘కృష్ణలంక’ ప్రతి ఎమోషన్‌ని పీక్స్‌లో చూపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు..
నిర్మాత పూనా సోహ్లా మాట్లాడుతూ : ‘‘కృష్ణలంక’ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా మా అంచనాలకు మించి వచ్చింది. ఒక మంచి సినిమా నిర్మించామన్న సంతృప్తి ఉంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితులు చక్క బడిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు..
మరో నిర్మాత చేతన్ మాట్లాడుతూ : ‘‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ తో మా సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసాము.. ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది. కార్తికేయ కథను డీల్ చేసిన విధానం మాకు బాగా నచ్చింది. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. ‘కృష్ణలంక’ సినిమా నిర్మించాక తెలుగులో మరిన్ని సినిమాలు తీయాలనిపిస్తుంది’’ అన్నారు..