Supreme Court EWS Reservations : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించిన సుప్రీంకోర్టు.. సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లు డిస్మిస్

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు యు. లలిత్ నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది సమర్థించారు.

Supreme Court EWS Reservations : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు యు. లలిత్ నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది సమర్థించారు. EWS రిజర్వేషన్ల కల్పన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లుబాటును బెంచ్ సమర్థించింది. జస్టిస్ లలిత్ మరియు మహేశ్వరి అభిప్రాయాలతో జస్టిస్ బేల ఎం త్రివేది ఏకీభవించారు.

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది డిస్మిస్ చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్‌లు కల్పన సరైనదేనని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది అన్నారు. EWS కోటా కోసం 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుందని చెప్పారు. ఇది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదని జస్టిస్ దినేష్ మహేశ్వరి చెప్పారు. EWS కోటా చెల్లుబాటు అవుతుంది.. రాజ్యాంగబద్ధమైనది అనే జస్టిస్ మహేశ్వరి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది తెలిపారు. EWS కోటాను జస్టిస్ యుయు లలిత్ సమర్థించారు.

Andhra Pradesh: అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఆర్థిక సమానత కోసం కాదు ప్రాతినిధ్యం కోసమేనని పిటిషనర్ల వాదిస్తున్నారు. ఆర్థిక వెనుకబాటుతనం రిజర్వేషన్ల కల్పనకు ఆధారం కాదనన్నారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంగించడమే అవుతుందని చెప్పారు.

సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో 50% రిజర్వేషన్లను మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్ర ప్రభుత్వం వాదన. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు