మీ రిలేషన్‌షిప్ సమస్యల్లో ఉందంటే ముందే ఈ లక్షణాలు కనిపిస్తాయ్..

మీ రిలేషన్‌షిప్ సమస్యల్లో ఉందంటే ముందే ఈ లక్షణాలు కనిపిస్తాయ్..

Updated On : February 4, 2021 / 8:37 PM IST

Ten signs your Relationship: మీ పార్టనర్ గిఫ్ట్‌లు ఇచ్చి ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నా అని చెప్తున్నారు. అప్పుడు మీకు అనిపించొచ్చు. రిలేషన్‌షిప్ బాగుందని.. మంచి జోడీ కుదిరిందని. నిజానికి అక్కడే అసలు సమస్య ఉంటుందని రీసెంట్ స్టడీ చెప్తుంది. గమనించకుండానే అలాంటి వారి మధ్య సమస్యలే పెరిగిపోతుంటాయట.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో నిర్వహించిన యూఎస్ రీసెర్చ్ ప్రకారం.. లవర్స్ మాట్లాడుకునే భాష, వారి రిలేషన్, పర్సనల్ అటాచ్మెంట్, బ్రేకప్ ల గురించి స్టడీ నిర్వహించింది. అందులో బాగా గమనించిందేంటంటే నేను, మనం అనే పదాలే ఎక్కువగా వినిపించాయట.

వీటితో పాటు సెక్స్ అండ్ రిలేషన్‌షిప్స్ గురించి చెప్పే జార్జెట్ కల్లీ రిలేషన్‌షిప్ కొన్ని కీలకవిషయాలు చెబుతున్నారు. బ్రేక్ అయిపోయే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని ఇలా చేసి వాటిని ఫిక్స్ చేసుకోవచ్చంటున్నారు.

సెక్స్‌కు దూరంగా ఉండటం
ఎదుటివ్యక్తి నుంచి దూరంగా వెళ్లాలనుకునేవారు ముందుగా సెక్స్ కు దూరంగా ఉంటారు. వారు మరెక్కడో శారీరకంగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.

ఊహించని గిఫ్ట్ లు
ఊహించని గిఫ్ట్ లు ఇచ్చి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే వారు చేసే మోసాన్ని బహుమతుల రూపంలో ఏమార్చేందుకు చేసే ప్రయత్నమిది.

మాజీ ప్రియుడు/ప్రియురాలు గురించి చెడ్డగా
నిజంగా ఓ వ్యక్తిని ఇష్టపడితే.. వారు మాజీ అయిపోయినంత మాత్రాన తిట్టాలనుకోరు. ఒకవేళ అలా చేస్తున్నారంటే అది కావాలని మీ ముందు చిత్రీకరిస్తున్నారనే.

లవ్ బాంబింగ్
అవసరానికి మించిన ప్రేమ చూపిస్తున్నారా.. మీకు భక్తుడు/భక్తురాలిలా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారా.. కచ్చితంగా వాళ్లు ఎక్కడో ఏదో చేస్తున్నారనే. వాళ్లలో గిల్టీ ఫీలింగ్ వచ్చినప్పుడే మీతో ఉన్న రిలేషన్‌షిప్ బ్రేకప్ అవకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

ప్రతి విషయానికి గొడవేనా
కొందరు ప్రతి విషయంలో సంతృప్తి చెందకుండా ఫైర్ అవుతుంటారు. అంటే దానికి వేరే అర్థం కూడా ఉండి ఉండొచ్చు. వాళ్ల మాజీకి దగ్గరవుదామని లేదా మాజీ లవర్ లా మీరూ ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు.

ఓవర్ షేరింగ్
సోషల్ మీడియాలో జరిగిన సంభాషణలు, ఇతరుల పోస్టులకు స్పందించిన కామెంట్లు చెబుతున్నారంటే.. మీరు ఒక కన్నేయాల్సిందే. ఎందుకంటే అన్నీ చెప్తున్నామనే భ్రమ తీసుకొచ్చి అసలైన విషయాన్ని ఏమారుస్తుంటారు.

ఇటువంటి అనుమానాలు, సందేహాలు వచ్చినప్పుడు నేరుగా టాపిక్ లోకి వచ్చేసి చర్చించుకోవడం ఉత్తమం. అనుమానాలను నివృత్తి చేసుకోకుండా ఒకరినొకరు ఇతర కారణాలతో నిందించుకుని రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకోకుండా కాపాడుకోవచ్చు.