Union Minister Anurag Thakur: పాక్ క్రికెట్ బోర్డ్ చైర్మన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, ఇండియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Union Minister Anurag Thakur: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, ఇండియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది పాకిస్థాన్ లో ఆసియా కప్-2023 జరుగుతుంది. ఈ టోర్నీ మ్యాచ్‌లు అన్ని పాకిస్థాన్ లోని గ్రౌండ్స్ లోనే జరుగుతాయి. ఈ క్రమంలో భద్రతా కారణాలు, ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకొని భారత్ క్రికెట్ జట్టు పాక్‌లో జరిగే ఆసియా కప్‌లో పాల్గోదని అక్టోబర్‌లో బీసీసీఐ కార్యదర్శి జేషా అన్నారు.

BCCI vs PCB: పాక్‌లో కాకరేపుతున్న బీసీసీఐ నిర్ణయం.. 23న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తుందా?

జైషా వ్యాఖ్యలకు స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్ తీరుతో ఆసియా, అంతర్జాతీయ క్రికెట్ కమ్యూనిటీలను విభజించే అవకాశం ఉందని, అదే జరిగితే 2023లో భారత్‌లో జరిగే వరల్డ్ కప్, ఇతర ఈవెంట్లలో పాకిస్థాన్ జట్టు పాల్గోదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలో తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించి కేంద్ర మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

BCCI vs PCB: బీసీసీఐ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించిన పీసీబీ.. అఫ్రీది రియాక్షన్ ఏమిటంటే?

రమీజ్ మాట్లాడుతూ.. మా వైఖరి స్పష్టంగా ఉంది. 2023లో పాకిస్థాన్లో జరిగే ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు పాల్గొంటుందనే ఆశిస్తున్నాం. పాల్గోకపోతే.. వచ్చే ఏడాది భారతదేశంలో జరిగే టోర్నీలను బహిష్కరిస్తాం అని అన్నాడు. మేం దూకుడు విధానాన్నే అవలంభిస్తాం అంటూ వ్యాఖ్యానించాడు. దీనికి కౌంటర్ గా కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశం ప్రధాన శక్తి. భారత దేశాన్ని ఏ దేశమూ విస్మరించలేదు. 2023 వరల్డ్ కప్‌కు అన్ని జట్లతో భారతదేశం అతిథ్యమిస్తుందని అన్నారు. ఇదిలాఉంటే 2023 ఆసియా కప్‌కోసం పాకిస్థాన్‌లో టీమిండియా పర్యటన‌ అంశంపై ప్రభుత్వ నిర్ణయంపైనే తాము ఆధారపడతామని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు