BCCI vs PCB: పాక్‌లో కాకరేపుతున్న బీసీసీఐ నిర్ణయం.. 23న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తుందా?

వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరిగే ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు పాల్గోదని బీసీసీఐ ప్రకటించిన విషయం విధితమే. దీంతో పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. నిర్ణయం మార్చుకోకపోతే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచ్ కప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్లు పలువురు స్పందిస్తూ.. 23న ఆస్ట్రేలియాలో భారత్‌తో జరిగే టీ20 మ్యాచ్‌ను బహిష్కరించాలని పీసీబీకి సూచించారు.

BCCI vs PCB: పాక్‌లో కాకరేపుతున్న బీసీసీఐ నిర్ణయం.. 23న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తుందా?

BCCI vs PCB

BCCI vs PCB: పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఆసియా కప్-2023 టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి భారత్ జట్టు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా ప్రకటించారు. భారత్ జట్టు ఆసియా కప్‌-2023లో ఆడాలంటే పాకిస్థాన్‌ వెలుపల తటస్థ వేదికపై టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమేనని తెలిపారు. జై షా ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

T20 World Cup-2022: టీ20 ప్రపంచ కప్‌లో ఈ 4 జట్లు సెమీఫైనల్ వెళ్తాయి!: సచిన్

ఆసియా కప్ కోసం భారత్ తమ దేశానికి రాకపోతే వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచ కప్‌ను బహిష్కరించే అవకాశాలను పరిశీలిస్తామని పీసీబీ హెచ్చరించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి పీసీబీ విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ప్రకటనలు ఆసియా, అంతర్జాతీయ క్రికెట్ సంబంధాలను దెబ్బతీస్తాయని పీసీబీ తెలిపింది. బీసీసీఐ నిర్ణయం పట్ల ఆ దేశ మాజీ, తాజా క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిది బీసీసీఐ తీరును తప్పుబట్టారు. ఇరుదేశాల క్రికెట్ ఆటగాళ్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఇలాంటి సమయంలో బీసీసీఐ నిర్ణయం తమను ఆశ్చర్యపర్చిందని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ స్పందించారు. బీసీసీఐ తీరుమార్చుకోకపోతే.. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ కోసం భారత్‌కు వెళ్లకూడదని బలమైన వైఖరిని కొనసాగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)ని కోరారు. అవసరమైతే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లోనూ 23న భారత్ జట్టుతో పాక్ మ్యాచ్ ఆడకుండా బహిష్కరించాలని పీసీబీకి సూచించారు. ఇదే విషయాన్ని మరికొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు పీసీబీకి సూచించారు. ఈ నేపథ్యంలో 23న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.