గుడికి వెళితే…తీర్థం, శఠారీ, ప్రసాదాలకు చెక్ పెట్టనున్నారా ? కేవలం..గుళ్లో ఉన్న దేవుడిని మాత్రమే దర్శించుకుని..ఏదైనా కోర్కెలు ఉంటే..తీర్చండి..స్వామి..అని మొక్కుకుని రావాల్సిందేనా ? ఇలాంటి పరిస్థితి త్వరలోనే చూస్తామా ? అంటే ఎస్ అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే కరోనా రాకాసి కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
ఇప్పటికే కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయి కూడా. వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో అన్నీ బంద్ అయిపోయాయి. జనాలు ఎక్కువగా ఉండే వాటికి ఇంకా తాళాలు వేలాడుతున్నాయి. అందులో దేవాలయాలు కూడా ఒకటి. ఆర్థిక రంగం కుదేలు కావడంతో..కొన్నంటికి సడలింపులు ఇచ్చింది. కానీ గుళ్లు తెరుచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ పడలేదు.
దేవాలయాలు 50 రోజులుగా తెరుచుకోవడం లేదు. కేవలం స్వామి వారికి ప్రతి రోజు నిర్వహించే ధూప, దీప, నైవేద్యాలను అర్చకులు కొనసాగిస్తున్నారు. భక్తులను అనుమతించడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 17 తర్వాత…కేంద్రం కొన్ని సడలింపులతో లాక్ డౌన్ కొనసాగుతుందనే ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత..దేవాలయాలు తెరిస్తే..ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై చర్చ జరుగుతోంది.
ఆలయానికి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు భక్తులు నియయ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భక్తులకు మాస్క్ లు, చేతులను శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక…దేవాలయాల్లో స్వామి వారి దర్శనం అయిన అనంతరం అర్చకులు ఇచ్చే తీర్థం, ప్రసాదం, శఠారీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.
ఎందుకంటే..కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడమే. ఒకరిపై పెట్టిన శఠారీ..మరొకరి తలపై పెట్టడం, ఇలాగే..తీర్థం, ప్రసాదాలు పెట్టడం సురక్షితమేనా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. స్వామి వారి ముందు వీటిని పెట్టి పూజించిన అనంతరం భక్తులకు ఇస్తుంటారు. బంద్ చేస్తే..ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయా ? అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.
కొన్ని ఆలయాల్లో అర్చకులకు వేతనాలు ఇచ్చే దానిపై కొన్ని నిబంధనలు పెడుతుంటాయి ఆలయ నిర్వాహకులు. శఠగోపంలో వచ్చే డబ్బులు సగం..గుడికి..సగం..పూజారీకి ఇచ్చే విధంగా, లేకపోతే..డబ్బులు మొత్తం..గుడికే వచ్చే విధంగా ఒప్పందాలు చేసుకుంటుంటారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వెయిట్ అండ్ సీ..
Read Here>> కరోనా ఎఫెక్ట్ : 26 సీట్లే..కొత్తగా ఏపీ బస్సులు