Moinabad Farmhouse Case: ఫామ్‌‌హౌజ్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

Moinabad Farmhouse Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. సిట్ ధర్యాప్తుకు సహకరించాలని, ప్రతీ సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని హైకోర్టు సూచించింది. నగరం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్టులు సిట్ అధికారులకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రూ.3లక్షల పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని నిందితులను న్యాయస్థానం ఆదేశించింది.

Jharkhand High Court: పదిహేనేళ్లు దాటిన ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు

హైకోర్టు తీర్పుతో నిందితులుగా పేర్కొంటున్న నందకుమార్, రామచంద్ర భారతిలపై మరికొన్ని కేసులు ఉండటంతో వారు జైల్లోనే ఉండే అవకాశం ఉంది. సింహయాజి మాత్రమే బయిల్ పై బయటకు వచ్చే అవకాశం ఉంది. రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు నకిలీ పాస్ పోర్టు కలిగి ఉన్నారనే ఆరోపణలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

Moinabad farmhouse case: ‘ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం’ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుపై తాత్కాలిక స్టే ఎత్తివేత

కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ రామచంద్ర భారతిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశముంది. నందకుమార్ పైనా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇది వరకే నందకుమార్‌ను కస్టడీలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు