Jharkhand High Court: పదిహేనేళ్లు దాటిన ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు

ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పదిహేనేళ్లు దాటిన ముస్లిం యువతులు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని కోర్టు నిర్ణయం తీసుకుంది.

Jharkhand High Court: పదిహేనేళ్లు దాటిన ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు

Jharkhand High Court: ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పదిహేనేళ్లు దాటిన ముస్లిం అమ్మాయిలు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ద్వివేది ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్ ఈ తీర్పు వెల్లడించింది.

Indian Army: శత్రు దేశాల డ్రోన్లు కూల్చేయనున్న గద్దలు.. శిక్షణ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ

ఈ తీర్పు ప్రకారం.. 15 ఏళ్లు దాటిన ముస్లిం అమ్మాయిలు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఈ విషయంలో తల్లిదండ్రులతోపాటు, సంరక్షకులు ఎవరూ అడ్డుచెప్పకూడదు. ఈ కేసుకు సంబంధించి బిహార్, నవాడా జిల్లాకు చెందిన మొహమ్మద్ సోనూ అనే 24 ఏళ్ల వ్యక్తి ఝార్కండ్‌కు చెందిన 15 సంవత్సరాల యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీనికి యువతి కుటుంబ సభ్యుల ఆమోదం లేదు. దీంతో తన కూతురుకు సోనూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యువతి తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో సోనూపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీటిని సవాలు చేస్తూ సోనూ ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, కేసు విచారణ జరిగేలోపు యువతి తల్లిదండ్రులు, సోనూ ఒక ఆమోదానికి వచ్చారు.

Bihar: తెల్లారేసరికి మాయమైన రెండు కిలోమీటర్ల రోడ్డు.. గ్రామస్తుల ఆశ్చర్యం.. అసలేం జరిగింది?

ఈ పెళ్లికి యువతి కుటుంబం ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపింది. సోనూను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు పెళ్లికి అంగీకరిస్తున్నామని యువతి తండ్రి కోర్టుకు తెలిపాడు. ఇరుపక్షాల నిర్ణయాన్ని అంగీకరించిన కోర్టు సోనూపై నమోదైన కేసుల్ని కొట్టివేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం 15 ఏళ్లు దాటిన యువతులు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని సూచించింది.