Tigers attacked a tourist bus : టూరిస్టు బస్సును వెంబడించిన పులులు.. వణుకు పుట్టించే వీడియో

ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి. కొన్ని వణుకు పుట్టిస్తాయి. ఓ టూరిస్టు బస్సు దట్టమైన అడవిలో ప్రయాణిస్తుంటే కొన్ని పులులు వెంబడించడం మొదలుపెట్టాయి. వీడియో చూస్తున్న కొద్దిసేపు భయం కలిగించింది.

Viral News : దట్టమైన అడవిలో పర్యటించడం అంటే అందరికీ థ్రిల్‌గా ఉంటుంది. కానీ అడవి జంతువులు ఏవైనా అటాక్ చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఓ టూరిస్టు బస్సును పులులు వెంబడించే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చూసేవారికి భయం వేస్తుంటే అందులో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉందో ఊహించలేం.

Bandhavgarh: పులులు తిరిగే అడవిలో బయటపడ్డ పురాతన ఆలయాలు, బౌద్ధారామాలు, గుహలు

@Bellaasays2 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో భయాన్ని కలిగిస్తోంది.. అలాగే థ్రిల్లింగ్ గానూ ఉంది. ఒక టూరిస్టు బస్సు వెళ్తుంటే అకస్మాత్తుగా పులుల గుంపు బస్సును వెంబడించింది. ఏం జరుగుతుందో చూసే లోపు బస్సు వాటిని దాటి వెళ్లిపోతుంది. పులులు వెనక్కి తిరిగి వెళ్లిపోతాయి. వాటిలో ఒకటి బస్సును పట్టుకుని దాంతో పాటు కదులుతుంటే చూసేవారికి భయం అనిపిస్తుంది. బస్సులో ప్రయాణికులు మాత్రం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించారు. ఎందుకంటే బస్సు పులులు దాడి చేయడానికి వీలు లేని విధంగా ఉంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

RTC Driver Emotion On Bus : స్టీరింగ్‌ను ముద్దు పెట్టుకుని,బస్సును కౌగిలించుకుని,క్లచ్, గేర్, బ్రేక్ తడుముతు ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగం

”జూ’లు ఇలాగే ఉండాలి .. మనుష్యులు పంజరంలో ఉంటారు.. జంతువులో మార్గంలో ఉంటాయి’ అని ఒకరు.. ‘సాహసం – బలహీనుల కోసం కాదు’ అని మరొకరు అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు