Poonam Kaur Disease : నిన్న సమంత, నేడు పూనమ్ కౌర్.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి, జబ్బు లక్షణాలు ఇవే..
హీరోయిన్ పూనమ్ కౌర్.. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇదో అరుదైన అనారోగ్య సమస్య. అలసట, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలు.
- Naveen
- Published On : December 1, 2022 / 06:34 PM IST
Poonam Kaur Disease : సౌత్ ఇండియన్ హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో అరుదైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నిన్న సమంత, ఇప్పుడు పూనమ్ కౌర్.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన నటి, హీరోయిన్ పూనమ్ కౌర్.. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నారు.
ఇదో అరుదైన అనారోగ్య సమస్య. అలసట, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలు. రెండుళ్లుగా ఈ జబ్బుతో బాధపడుతున్న పూనమ్ కౌర్.. కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఎస్వీ కృష్ణారెడ్డి ‘మాయాజాలం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది పూనమ్ కౌర్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.(Poonam Kaur Disease)
Also Read : Samantha: సమంత ఏంటి ఇలా అయ్యిపోయింది.. వైరల్ అవుతున్న ఫోటోలు!
ఈ వ్యాధి కారణంగా.. నిద్ర లేకపోవటం, త్వరగా అలసిపోవటం, కండరాల నొప్పి, మానసిక ఒత్తిడితో పూనమ్ ఇబ్బంది పడుతోందట. దీని నుంచి బయట పడటానికి చికిత్స కూడా తీసుకుంది. అయినా తగ్గలేదట. దీంతో ఆమె ఇప్పుడు కేరళలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోందని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రెండేళ్లుగా తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను పూనమ్ బయట పెట్టలేదు. అయితే ఇప్పుడు ఆమె తీసుకుంటున్న ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు లీక్ కావటంతో విషయం వెలుగుచూసింది. కేరళలో ట్రీట్‌మెంట్ కంటే ముందే పలు ఆసుపత్రుల్లో చూపించుకుంది. డాక్టర్లను సంప్రదించింది. కానీ నయం కాలేదు. దీంతో ఆమె.. ప్రకృతి వైద్యం చేసి నయం కాని రోగాలను సైతం నయం చేసే పేరున్న కేరళకు వెళ్లిందని, అక్కడే ఉంటూ చికిత్స తీసుకుంటోందని సమాచారం.(Poonam Kaur)
Also Read : Samantha: సమంతకు ఆ సీరియస్ జబ్బు.. త్వరలోనే కోలుకుంటానని ప్రకటన
ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పూనమ్ కౌర్ పాల్గొనడం హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ కు తెలియజేసింది పూనమ్. అలాగే రాహుల్ గాంధీ చేయి పట్టుకుని పూనమ్ నడుస్తున్న ఫొటోలపై వివాదం చేలరేగింది. తాను పడిపోతుంటే రాహుల్ గాంధీ చేయి పట్టుకున్నారని దీనిపై రాజకీయాలు చేయటం తగదని ఫైర్ అయ్యింది పూనమ్.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
మరోవైపు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ సమంత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు స్వయంగా సమంతే వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. సమంత కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
