Tollywood : లేటెస్ట్ 30 ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్..
కోలీవుడ్ స్టార్ కమెడియన్.. సీనియర్ యాక్టర్ వివేక్ కన్నుమూశారు. నిన్న హార్ట్ ఎటాక్‌తో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరిన వివేక్... ట్రీట్‌మెంట్ తీసుకుంటూ.. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు..

Tollywood Latest Entertainment Updates
Vivek: హాస్య శిఖరం..
కోలీవుడ్ స్టార్ కమెడియన్.. సీనియర్ యాక్టర్ వివేక్ కన్నుమూశారు. నిన్న హార్ట్ ఎటాక్‌తో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరిన వివేక్… ట్రీట్‌మెంట్ తీసుకుంటూ.. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
Vivek : జ్ఞాపకాలు..
దాదాపు 300లకు పైగా సినిమాల్లో రజనీకాంత్, కమల్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్ పక్కన కమెడియన్‌గా సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన వివేక్ జ్ఞాపకాలను తలచుకుని కోలీవుడ్ కన్నీరు మున్నీరు అవుతోంది.
Vivek : స్టార్స్ సంతాపం..
వివేక్ మరణవార్త విన్న కోలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ సంతాపం ప్రకటిస్తున్నారు. సూర్య, కార్తి, జ్యోతిక, శంకర్, నాజర్ లాంటి స్టార్స్ వివేక్ ఇంటికి వెళ్లి నివాళి అర్పించారు. ఇక రజనీ కాంత్, సిథ్థార్ధ్, సమంత, సత్యరాజ్, శివకార్తికేయన్ లాంటి స్టార్స్ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు.
Vivek : గొప్ప పర్వావరణ వేత్త..
వివేక్ గొప్ప నటుడే కాదు అంతకు మించిన పర్వావరణ వేత్త.. హోస్ట్ కూడా.. అబ్దుల్ కలాంకు ఏకలవ్య శిష్యుడు.. కోటి మొక్కలు నాటే లక్ష్యంతో 33 లక్షలకు పైగా మొక్కలు నాటిన వివేక్ కోటి మొక్కల కల నెరవేరకముందే వెళ్ళిపోయారు.
Akhanda : రెస్పాన్స్ అదిరింది..
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బాలయ్య సినిమా టైటిల్ రావడంతో.. అఖండా మూవీ టైటిల్ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రెండు కోట్లకు పైగా వ్యూస్ సాధించింది అఖండా టీజర్..
Sonu Sood : ఆపద్భాందవుడికి కరోనా..
కలియుగ ఆపద్భాందవుడిగా పేరు తెచ్చుకున్న స్టార్ సోనూ సూద్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆచార్య లాంటి కొన్ని సినిమాల షూటింగ్స్‌లో ఉన్న ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు.
Mahesh Babu : గెట్ వెల్ సూన్..
పవన్‌కు కరోనా సోకడంపై మహేష్ బాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘గెట్ వెల్ సూన్.. స్ట్రెంగ్త్ అండ్ ప్రేయర్స్’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
Rashmika Mandanna : జర్నలిస్ట్‌గా..
రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ మూవీ గురించి సూపర్ ఫాస్ట్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలి అని చూస్తున్నారు. ఇక ఇందులో ఆమె జర్నలిస్టు పాత్రలో కనిపిస్తుందని సమాచారం.
Uppena : మరొక్కసారి..
బుచ్చిబాబు – వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టిల కాంబో మూవీ ఉప్పెన సక్సెస్‌తో మంచి పేరు వచ్చింది. దాంతో వీరి కాంబినేషన్లో మరో సినిమా కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఉప్పెన మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తారని తెలుస్తోంది. మరో కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నారు.
Viswak Sen : అశోకవనంలో..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా విద్యాసాగర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు అశోకవనంలో అర్జున కల్యాణం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు..
Anurag Kashyap : మహేష్ విలన్‌గా..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట.. ఈ సినిమాలో విలన్‌గా కోలీవుడ్ స్టార్ రొమాంటిక్ హీరో మాధవన్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి…
NTR 30 : అమాయకుడిగా..
కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో తారక్ ఓ పల్లెటూరి అమాయకపు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. తారక్ క్యారెక్టర్‌లో రెండు డిఫరెంట్ షేడ్స్‌ను కొరటాల చూపించబోతున్నారు.
A.R. Murugadoss : డిఫరెంట్‌గా…
1947 అనే టైటిల్‌తో సినిమాను ప్రకటించారు మురుగదాస్. పాన్‌ఇండియా స్థాయిలో హిందీ నిర్మాత ఓం ప్రకాశ్ భట్ ఈ మూవీని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటి? నటీనటులు ఎవరు? అనే అంశాలపై స్పష్టత రాలేదు.
Siddharth : హ్యాపీ బర్త్‌డే..
మహా సముద్రం సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సిద్ధార్థ్. ఈరోజు సిద్దు బర్త్‌డే సందర్భంగా మహా సముద్రం టీమ్ బర్త్‌డే విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.
Maguva Song : ఫిమేల్ వెర్షన్..
రీసెంట్‌గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ. ఈ సినిమాలో మగువా పాట ఇంకా హిట్ అయ్యింది. ఈసాంగ్ ఫిమేల్ వెర్షన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు టీమ్.
Kajal Aggarwal : గోష్ఠి..
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో తమిళ, తెలుగు భాషల్లో ఎస్.కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు గోష్ఠి అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ని జనవరిలో ప్రారంభించి, ఫాస్ట్‌గా కంప్లీట్ చేశారు. నెలాఖరుకి దీనిని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
Keerthy Suresh : శాంపుల్ మాత్రమే…
తన ఫోటోల స్కెచ్‌లను వరుసగా వీడియోచేసి పోస్ట్ చేసింది కీర్తి సురేష్. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటూ క్యాప్షన్ రాసింది. అద్భుతమైన స్కెచ్‌లను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Pawan Kalyan : త్రివిక్రమ్‌తో..
కొంత గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్ బాబుతో, త్రివిక్రమ్ చేసే సినిమా పూర్తయ్యాక ఇది సెట్స్‌కి వెళ్తుందని సమాచారం.
Deepika Padukone : లాంగ్ బ్రీత్..
బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తుంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దీపికా పదుకొనే. ఉదయాన్నే నేలపై కూర్చుకుని లాంగ్ బ్రీత్ తీసుకుంటున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు దీపికా.
Karnan : దుమ్ము దులిపి..
బాక్సాఫీస్ బద్దకాన్ని వదిల్చి.. పట్టిన దుమ్మును దులిపేసింది కర్ణన్ సినిమా. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కోలీవుడ్‌లో రిలీజ్ అయిన రోజు నుంచే రచ్చ చేస్తోంది. ఈ ఐదు రోజుల్లో దాదాపు 40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందీ మూవీ..
Janhvi Kapoor : గ్యాంగ్ డాన్స్..
తన గ్యాంగ్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ.. కూల్ గ్యాంగ్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను అప్‌లోడ్ చేసింది జాన్వీ కపూర్..
Meera Jasmine : 6 ఏళ్ళ తరువాత…
6 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు హీరోయిన్ మీరాజాస్మిన్.. మలయాళ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ రూపొందిస్తున్న సినిమాతో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు.. జయరాం, మీరా జాస్మిన్‌లు ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది.
Vijay Antony : మే 14న విడుదల..
విజయ్ ఆంటోనీ హీరోగా.. ఆనంద్ క్రిష్ణన్ డైరెక్షన్‌లో తెలుగు, తమిళ భాషల్లోరూపొందుతున్న సినిమా విజయ రాఘవన్.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ మే 14న రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
Sehari : ఇంప్రెస్సివ్ టీజర్..
యంగ్ స్టార్స్ హర్ష్ కానుమిల్లి, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫన్ ఎంటర్‌టైనర్ సెహరి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
Kangana Ranaut : ఇల్లే కదా స్వర్గసీమ..
మంచుకొండల్లో 30 కోట్లతో తాను కట్టుకున్న ఇంటిని స్వర్గం అంటోంది బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న తన ఇంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pragya Jaiswal : నీడనెప్పుడు చూడాలి..
ఎప్పుడూ సూర్యున్ని చూస్తుంటే.. నీడను చూసే అవకాశం ఉండదు అంటోంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఫిలాసఫీ చెపుతూ.. న్యూ క్లిక్‌ను షేర్ చేసింది.
Renu Desai : ప్రపంచంతో పనిలేదు..
తనకు ప్రపంచంతో పనిలేదు అంటోంది.. మాజీ హీరోయిన్ రేణూ దేశాయ్. ప్రశాంత వాతావరణం… ఫీస్ ఫుల్ లైఫ్ ఉంటే.. ఒంటరితనం కూడా బాగుంటుందంటోంది.. ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న పిక్‌ను అభిమానులతో పంచుకుందామె.
Hansika Motwani: యువరాణి..
ఈ మధ్య బాగా బరువు తగ్గిన హీరోయిన్ హన్సిక యువరాణిలా తయారయ్యింది. జ్యువెలరీతో పాటు ట్రెషిషనల్ డ్రెస్‌లో మెరిసిపోతున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది హన్సిక..
Seva Daas : సేవాదాస్..
హీరోగా, దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్నKPN చౌహాన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న మూవీ సేవాదాస్. .తెలుగు, బంజారా భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రీతి అశ్రాని హీరోయిన్. సుమన్, భానుచందర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు.
Chitrapatham : చిత్రపఠం..
తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే కథతో.. శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో బండారు దానయ్య కవి తెరకెక్కిస్తున్న సినిమా చిత్రపఠం. ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మూవీ టీమ్.