మొన్న భువనేశ్వరి.. నిన్న బ్రాహ్మణి.. ఇప్పుడు చంద్రబాబు.. నారా ఫ్యామిలీకి అవార్డుల పండుగ

Chandrababu Naidu : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఎకనామిక్ టైమ్స్ సంస్థ అవార్డును

మొన్న భువనేశ్వరి.. నిన్న బ్రాహ్మణి.. ఇప్పుడు చంద్రబాబు.. నారా ఫ్యామిలీకి అవార్డుల పండుగ

Chandrababu Naidu

Updated On : December 18, 2025 / 1:32 PM IST

Chandrababu Naidu : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఎకనామిక్ టైమ్స్ సంస్థ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకుగానూ… ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబు నాయుడు అందుకోనున్నారు.

దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ అవార్డుకు ఎంపిక చేసింది. జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు ఉన్నారు.

గతంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్ (2024), ఎస్. జైశంకర్ (2023), నిర్మలా సీతారామన్ (2021), మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్ (2019), కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (2017), పీయూష్ గోయల్ (2015) వంటి వారికి అవార్డు లభించాయి. ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై ప్రముఖులు, మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి వరుసగా అవార్డు లభించాయి. గత నెలలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థకు ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌’ విభాగంలో లభించిన గోల్డెన్‌ పీకాక్‌ అవార్డునూ ఆ సంస్థ వీసీఎండీ అయిన భువనేశ్వరికి ఇదే వేదికపై అందజేశారు.

నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మిణీ కూడా ఇటీవల ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ అందించే ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు బ్రహ్మిణి ఎంపికయ్యారు. ముంబై వేదికగా జరిగిన వేడుకలో బ్రహ్మణి ఈ అవార్డును అందుకున్నారు.